Return to Video

The Internet: Wires, Cables, & Wifi

  • 0:03 - 0:08
    ఇంటర్నెట్ | వైర్లు, కేబుల్స్ మరియు వై-ఫై
  • 0:08 - 0:13
    నా పేరు టెస్ విన్‌లాక్, నేను Google లో
    సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని.
  • 0:13 - 0:18
    ఇక్కడోప్రశ్న: ఒక చిత్రం, వచనం లేదా ఇమెయిల్
    ని ఒక డివైజ్ మరో డివైజ్ కి ఎలా పంపుతుంది?
  • 0:18 - 0:25
    అద్భుతం కాదా ఇది? అదే ఇంటర్నెట్. సమాచారం
    పంపించడానికి ఒక గణనీయమైన భౌతిక వ్యవస్థ.
  • 0:25 - 0:30
    ఇంటర్నెట్ అనేది తపాలాసేవ లాంటిది, ఐతే పంపే
    భౌతిక పదార్థం చిన్నది ఐతే భిన్నమైనది.
  • 0:30 - 0:37
    బాక్సులు, కవర్లకు బదులు ఇంటర్నెట్ బైనరీ
    సమాచారాన్ని తరలిస్తుంది. సమాచారం
  • 0:37 - 0:41
    బిట్స్ తో చేయబడి ఉంటుంది. బిట్ అంటే ఏదైనా
    వ్యతిరేకాల జంట అనిచెప్పొచ్చు: ఆన్ లేదా ఆఫ్
  • 0:41 - 0:49
    ఔను లేక కాదు ఇలా. మనం ముఖ్యంగా 1 ని ఆన్
    లేదా 0 ని ఆఫ్ గా చూస్తాం. ఎందుకంటే బిట్
  • 0:49 - 0:56
    బైనరీ కోడ్ అనే స్థితిని కలిగి ఉంటుంది. 8
    బిట్స్ కలిపితే 1బైట్ అవుతుంది. 1000 బైట్లు
  • 0:56 - 1:02
    కలిస్తే ఒక కిలోబైట్. 1000 కిలోబైట్లు ఒక
    మెగాబైట్. ఒక పాట ముఖ్యంగా 3-4 మెగాబైట్లతో
  • 1:02 - 1:08
    ఎన్‌కోడ్ చేయబడుతుంది. అదిబొమ్మ ఐనా, వీడియో
    ఐనా లేదా పాటైనా పర్వాలేదు, ఇంటర్నెట్ పై
  • 1:08 - 1:13
    ప్రతీదీ బిట్లుగా చూపించి పంపబడుతుంది. ఇవి
    సమాచారము యొక్క పరమాణువులు. ఐతే ఇది మనం
  • 1:13 - 1:17
    ఒకట్లు మరియు సున్నాలను భౌతికంగా ఒక చోటి
    నుండి మరోచోటికి వ్యక్తి నుండి మరోవ్యక్తికి
  • 1:17 - 1:22
    పంపడం వంటిది కాదు. మరి వైర్లు మరియు గాలి
    దారుల గుండా పంపించబడే భౌతిక పదార్థం ఏది?
  • 1:22 - 1:26
    సరే, మనుషులు ఒకచోటి నుంచి మరోచోటికి చిన్న
    సమాచారం పంపడానికి భౌతికంగా ఎలాకమ్యూనికేట్
  • 1:26 - 1:31
    చేసుకుంటారో ఇక్కడ ఒక చిన్నఉదాహరణ చూద్దాం.
    మనం ఒక లైట్ ని 1 కి ఆన్ చేస్తాం 0కి ఆఫ్
  • 1:31 - 1:37
    చేస్తాం అనుకుందాం.లేదా బీప్స్ లేదా మోర్స్
    కోడ్ కి అలాంటి పనులు చేస్తాం.
  • 1:37 - 1:42
    ఈ పద్ధతులు పనిచేస్తాయి, ఐతే అవి నిజంగా
    నెమ్మది, తప్పులుగా ఉంటాయి మరియు పూర్తిగా
  • 1:42 - 1:47
    మానవాధారితం. మనకు నిజంగా కావాల్సింది ఒక
    మెషీన్.చరిత్రలో ఎన్నో వ్యవస్థలు నిర్మించాం
  • 1:47 - 1:51
    అవి వివిధరకాల భౌతిక మాధ్యమాల ద్వారా ఈబైనరీ
    సమాచారాన్ని వాస్తవంగా పంపించగలుగుతాయి.
  • 1:51 - 2:00
    ఈరోజు మనం విద్యుత్, కాంతి, రేడియో వేవ్స్
    ద్వారాభౌతికంగా బిట్స్ పంపుతున్నాం.విద్యుత్
  • 2:00 - 2:05
    తో ఒక బిట్ పంపడానికి, మీవద్ద రాగివైర్ కి
    తగిలించిన 2 బల్బులు ఉన్నాయనుకోండి,విద్యుత్
  • 2:05 - 2:09
    ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. విద్యుత్
    లేకపోతే బల్బ్ వెలగదు. ఒకవేళ రెండు చివర్లలో
  • 2:09 - 2:14
    ఆపరేటర్లు లైట్ అంటే 1, లైట్ ఆఫ్ అంటే 0 అని
    ఒప్పుకుంటే, మన వద్ద విద్యుత్ ని ఉపయోగించి
  • 2:14 - 2:20
    వ్యక్తి నుంచి వ్యక్తికి బిట్స్ లో సమాచారం
    పంపడానికి ఒక వ్యవస్థ ఉన్నట్టు. ఐతే మనకు
  • 2:20 - 2:25
    ఇక్కడా కాస్త సమస్య ఉంది, మీరు గనక వరుసలో
    0 ని ఐదుసార్లు పంపించాలంటే, దాన్ని మీరెలా
  • 2:25 - 2:30
    చేస్తారు, ఏమనిషైనా వాస్తవంగా 0 ల సంఖ్యను
    లెక్కపెట్టే విధంగా ఎలా పంపిస్తారు? సరే,
  • 2:30 - 2:35
    ఒక క్లాక్ లేదా టైమర్ తీసుకోవడం పరిష్కారం.
    పంపించేవారు సెకనుకి 1 బిట్ పంపించేలా
  • 2:35 - 2:39
    తీసుకునేవారు కూర్చొని ప్రతి సెకను నమోదు
    చేసుకుని లైనులో ఏముందో చూసేందుకు
  • 2:39 - 2:44
    ఆపరేటర్లు ఒప్పుకోవచ్చు. ఒక వరుసలో ఐదు 0
    లను పంపడానికి, మనం కేవలం లైట్ ఆఫ్ చేస్తాం,
  • 2:44 - 2:48
    5 సెకెన్లు ఆగుతాం, లైన్ అవతలివైపు వ్యక్తి
    ఆ 5 సెకెన్లనూ రాసుకుంటారు. ఒక వరుసలో ఐదు
  • 2:48 - 2:54
    1ల కొరకు, దాన్నిఆఫ్ చేసి 5సెకెన్లు ఆగుతారు
    ప్రతి సెకెన్ రాసుకుంటారు. సహజంగా మనం సెకన్
  • 2:54 - 2:58
    కి 1 బిట్ కంటే వేగంగానే పంపాలనుకుంటాం,
    కాబట్టి మనం మన బ్యాండ్‌విడ్త్ పెంచాలి
  • 2:58 - 3:04
    అంటే డివైజ్ యొక్క గరిష్ట ప్రసార సామర్థ్యం.
    బ్యాండ్‌విడ్త్ బిట్‌రేట్ తో కొలవబడుతుంది,
  • 3:04 - 3:09
    అది,ఇవ్వబడిన సమయంలో, మామూలుగా సెకెన్లలోమనం
    వాస్తవంగా పంపగలిగిన బిట్స్ సంఖ్యగా ఉంటుంది
  • 3:09 - 3:14
    వేగం యొక్క విభిన్న కొలత అచేతనం, లేదా ఒక
    బిట్ ఒకచోటునుండి మరోచోటికి ప్రయాణించడానికి
  • 3:14 - 3:22
    సోర్స్ నుండి కోరుతున్న ఉపకరణానికి అది
    తీసుకునే సమయం అయి ఉంటుంది.
  • 3:22 - 3:27
    మన మానవ సామ్యంలో, సెకనుకు ఒక బిట్ అంటే
    వేగమే, ఐతే దాన్ని ఉంచుకోవడం మనిషికి కాస్త
  • 3:27 - 3:31
    కష్టం. మీరు 3సెకెన్లలో 3MB పాట డౌన్‌లోడ్
    చేసుకోవాలనుకుంటున్నారనుకుందాం, అది మెగా
  • 3:31 - 3:37
    బైట్ కు 8 మిలియన్ బిట్స్ వంతున, అంటే
    సెకనుకు 8మిలియన్ బిట్స్ వంతున బిట్ రేటుతో.
  • 3:37 - 3:41
    సహజంగా, మనుషులు సెకనుకు 8 మిలియన్ బిట్స్
    పంపలేరు, అందుకోలేరు, ఐతే ఒక మెషీన్ దాన్ని
  • 3:41 - 3:45
    చాలాబాగా చేస్తుంది.ఐతే ఇప్పుడు ఈసందేశాల్ని
    పంపడానికి ఎటువంటి కేబుల్ కావాలి, మరి ఎంత
  • 3:45 - 3:50
    దూరం ఈ సిగ్నల్స్ వెళతాయి అనేదే ప్రశ్న మరి.
    ఈథర్నెట్ వైర్ తో, మీ ఇల్లు, ఆఫీస్, లేదా
  • 3:50 - 3:56
    స్కూల్ లో మీకు దొరికేదాంట్లో గణనీయమైన
    సిగ్నల్ లోపం, లేదా 100 అడుగుల లోనే అంతరాయం
  • 3:56 - 4:01
    చూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్
    పనిచేయడానికి మనకు ప్రత్యామ్నాయ పద్ధతి
  • 4:01 - 4:06
    కావాల్సి ఉంది, ఈ బిట్స్ ని నిజంగా చాలా
    దూరం పంపడానికి. మనం మహాసముద్రాలను దాటి
  • 4:06 - 4:11
    తీసుకెళుతున్నాం. మరి మనం దేన్ని వాడొచ్చు?
    ఒక వైర్ గుండా విద్యుత్తు కంటే ఎంతోఎక్కువ
  • 4:11 - 4:18
    వేగంగా ఏది కదుల్తుంది? కాంతి. మనంవాస్తవంగా
    కాంతిపుంజాలుగా బిట్స్ ని పంపించొచ్చు, ఒక
  • 4:18 - 4:23
    చోటునుండి మరోచోటుకు ఫైబర్ఆప్టిక్ కేబుల్తో.
    అది కాంతి పరావర్తనానికి గ్లాస్ ఇంజనీరింగ్
  • 4:23 - 4:27
    తీగ. కేబుల్ కింద మీరు కాంతిపుంజాన్నిపంపితే
    కాంతి కేబుల్ పొడవునా పైకీ కిందికీ తిరిగి,
  • 4:27 - 4:31
    మరో చివరికి అది చేరేవరకూ బౌన్స్ అవుతుంది.
    బౌన్స్ కోణంపై ఆధారపడి, మనం వాస్తవంగా ఒకే
  • 4:31 - 4:36
    సారి అనేక బిట్స్ పంపించొచ్చు, అవన్నీ కూడా
    కాంతి వేగముతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఫైబర్
  • 4:36 - 4:41
    నిజంగా చాలా వేగం. ఐతే మరీ ముఖ్యంగా, ఎంత
    ఎక్కువ దూరమైనా సిగ్నల్ బలహీనపడదు. ఈ విధంగా
  • 4:41 - 4:45
    మీరు వందలాది మైళ్ళు సిగ్నల్ నష్టపోకుండా
    వెళ్ళగలరు. అందుకనే మనం సముద్రాల గుండా
  • 4:45 - 4:50
    ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడతాం, ఖండాంతర
    స్థలాల్ని మరోదానితో కలపడానికి. 2008 లో
  • 4:50 - 4:56
    ఒకకేబుల్ వాస్తవంగా అలెగ్జాండ్రియా,ఈజిప్ట్
    దగ్గర కట్ అయి, నిజంగా మధ్యప్రాచ్యం మరియు
  • 4:56 - 5:01
    ఇండియాలో చాలా ప్రాంతాలకు ఇంటర్నెట్ అంతరాయం
    కలిగింది. కావున మనం ఈ ఇంటర్నెట్ విషయాన్ని
  • 5:01 - 5:05
    మంజూరుగా తీసుకుంటాం, ఐతే నిజంగా అది చాలా
    పెళుసైన భౌతిక వ్యవస్థ. ఫైబర్ చాలా బాగుంది
  • 5:05 - 5:09
    ఐతే అది ఖరీదైంది మరి దాంతో పని కష్టం కూడా.
    అనేక పనులకు, మీరు రాగి కేబుల్ కోసం
  • 5:09 - 5:17
    చూస్తారు. ఐతే వైర్లు లేకుండా మనం ఏ విధంగా
    పంపుతాం? వైర్‌లెస్‌గా ఎలాపంపుతాం?రేడియో.
  • 5:17 - 5:21
    వైర్లెస్ బిట్ పంపేమెషీన్లు ఓచోటినుండి మరో
    చోటికి బిట్స్ పంపేందుకు రేడియో సిగ్నల్స్
  • 5:21 - 5:28
    వాడతాయి.మెషీన్లు వాస్తవంగా1లు,0లను విభిన్న
    అంతరాల రేడియో తరంగాలుగా మార్చాలి. అందుకునే
  • 5:28 - 5:32
    మెషీన్లు ప్రక్రియను వెనక్కి చేసి బైనరీ
    లోనికి మళ్ళించి మీ కంప్యూటర్ పై చూపుతాయి.
  • 5:32 - 5:38
    కాబట్టి వైర్‌లెస్ అనేది మన ఇంటర్నెట్ ని
    సంచారంగా చేసింది. ఐతే రేడియో తరంగం అంతదూరం
  • 5:38 - 5:42
    ప్రయాణించదు, ముందుగానే అది కలగాపులగం
    అయిపోతుంది. అందుకనే మీరు లాస్ ఏంజిల్స్
  • 5:42 - 5:48
    రేడియో స్టేషన్ ని చికాగోలో అందుకోలేరు.
    వైర్లెస్ ఎంత గొప్పగా ఉన్నా, ఈరోజు అదిఇంకా
  • 5:48 - 5:52
    వైర్డ్ ఇంటర్నెట్ పైనే ఆధారపడింది. మీరు గనక
    వైఫై వాడుతూ కాఫీషాప్ లో ఉంటే, అపుడు బిట్స్
  • 5:52 - 5:56
    ఈ వైర్లెస్ రూటర్కి వెళ్ళి, నిజంగాఇంటర్నెట్
    దూరాలకు భౌతిక వైర్ ద్వారా బదిలీ చేయబడతాయి
  • 5:56 - 6:01
    బిట్స్ పంపించడానికి భౌతిక పద్ధతి భవిష్యత్
    లో మారొచ్చు, దాని లేజర్లను ఉపగ్రహాల మధ్య
  • 6:01 - 6:06
    లేదా బెలూన్ల నుండి రేడియో తరంగాలు లేదా
    డ్రోన్ల మధ్య పంపించినా, లోపల దాగి ఉన్న
  • 6:06 - 6:11
    సమాచారం యొక్క బైనరీ ప్రాతినిధ్యం మరియు ఆ
    సమాచారం పంపడానికి మరియు అందుకోవడానికి
  • 6:11 - 6:15
    ప్రోటోకాల్స్ మాత్రం యధావిధిగానే ఉంటాయి.
    ప్రతీదీ ఇంటర్నెట్ పైన, అవి మాటలైనా,
  • 6:15 - 6:21
    ఇమెయిల్స్, బొమ్మలు, క్యాట్ వీడియోలు, పప్పీ
    వీడియోలు, అన్నీ కూడా ఈ ఒకట్లు, సున్నాల
  • 6:21 - 6:26
    నుండే వస్తాయి, ఎలక్ట్రానిక్ నాడులు, కాంతి
    పుంజాలు, రేడియో వేవ్స్ ఇంకా ఎంతో ప్రేమ.
Title:
The Internet: Wires, Cables, & Wifi
Description:

more » « less
Video Language:
English
Duration:
06:41

Telugu subtitles

Revisions