Return to Video

జీవితంలోని దశలగూర్చి మహాకవుల ఆలోచనలు

  • 0:01 - 0:03
    వచ్చే నెలలో నాకు 44 ఏళ్లు వస్తాయి.
  • 0:03 - 0:08
    నాకు మంచి భవిష్యత్తు ఉన్న సంవత్సరం
    ఇది అనిపిస్తుంది
  • 0:08 - 0:11
    జ్ఞానం,పరిపూర్ణతలను సాధిస్తానని నా ఊహ
  • 0:12 - 0:13
    నాకు జరిగేదాన్ని ఊహించగలను
  • 0:13 - 0:16
    ఏదో ప్రత్యేకత అందులో దాగిఉందని కాదు
  • 0:16 - 0:19
    కానీ అద్భుతమైన సం. అని అనుకుంటున్నాను
  • 0:19 - 0:22
    1968 లో నార్మన్ మెయిలర్ రచించిన పుస్తకంలో
  • 0:22 - 0:25
    44 ఏళ్ళప్పుడు అతని వయస్సుకు
    అర్థాన్ని తెలుసుకున్నాడు
  • 0:25 - 0:28
    ఆ మాట ఆర్మీస్ ఆఫ్ ది నైట్ లో రాసాడు
  • 0:28 - 0:31
    "తానొక స్థిరమైన మూర్తిని అనుకున్నాడు
  • 0:31 - 0:35
    ఎముకలు,కండరాలు,గుండె,బుధ్ధి లతో బాటు
    మానసిక ప్రవృత్తి కూడా వున్నాయని
  • 0:35 - 0:37
    అలా అతను అవతారం దాల్చినట్లు"
  • 0:37 - 0:40
    మెయిలర్ నా గురించే రాయలేదని నాకు తెలుసు
  • 0:40 - 0:42
    కానీ నాకింకో విషయం కూడా తెలుసు
  • 0:43 - 0:47
    మనందరికోసం,మీరు ,నేను అందరం
    పుస్తకంలోని విషయాలమే
  • 0:47 - 0:49
    వయస్సులో కాస్త ముందూ వెనుకా ఉండొచ్చు
  • 0:49 - 0:52
    పుట్టినప్పటి నుంచి ఒకే క్రమంలో పెరిగాం
  • 0:53 - 0:56
    బాల్యం లోని చిన్న చిన్న ఆనందాలు,
    కట్టుబాట్ల గుండా
  • 0:56 - 1:00
    కౌమారంలోని నిరాశలు,నిస్పృహలు కూడా
  • 1:00 - 1:03
    యవ్వనంలోని సాధికారత వంటివి మైలురాళ్లు
  • 1:04 - 1:08
    వృధ్ధాప్యంలోని గుర్తింపులు,విరమణలు
  • 1:08 - 1:10
    జీవితానికో అర్థం వుంది,
  • 1:10 - 1:12
    వాటిని పంచుకోవాలి.
  • 1:12 - 1:17
    వాళ్ళకు జరిగినట్టే నాకూ జరుగుతుంది
    అంటాడు థామస్ మన్
  • 1:18 - 1:20
    ఈ క్రమాలను అనుభవించడమే కాదు
  • 1:20 - 1:22
    మనం భద్రపరుస్తాం కూడా.
  • 1:22 - 1:25
    మనం పుస్తకాలలో రాస్తూవుంటాము
    కాలక్రమంలో అవే కథనాలౌతాయి
  • 1:25 - 1:27
    అప్పుడు వాటిని చదువుతాము,గుర్తిస్తాము
  • 1:28 - 1:30
    మనమేంటో చెప్తాయి పుస్తకాలు
  • 1:30 - 1:33
    మన గతం ,భవిష్యత్తు కూడా
  • 1:33 - 1:35
    అవి చిరకాలం నిలిచివుంటాయి.
  • 1:36 - 1:38
    జేమ్స్ సాల్టర్ రాసినట్లుగా
  • 1:38 - 1:42
    జీవితపుపుటలు కదిలిపోతూ వుంటాయి
    దేన్నైనా దాటుకుని
  • 1:43 - 1:46
    6 సంవ ముందు, ఆలోచన ఒకటి
    మనసు లో మెదులుతుంది
  • 1:46 - 1:50
    జీవితపుపుటలు జరిగిపోతున్నప్పుడు
    ఎక్కడో, ఎప్పుడో
  • 1:50 - 1:53
    ప్రతి దశ గురించీ రాయబడివుంటుంది
  • 1:53 - 1:56
    వాటిని గనుక నేను గుర్తిస్తే,జోడించి
    ఒక కథనాన్ని సృష్టించివుండేవాణ్ణి
  • 1:56 - 1:58
    జోడించిన వాటికి జీవం పోసివుండేవాణ్ణి
  • 1:58 - 2:01
    నిండునూరేళ్ళ దీర్ఘజీవితం
  • 2:01 - 2:03
    పరిణామ క్రమంలోని సమగ్రత
  • 2:03 - 2:06
    అదృష్టవంతులు మాత్రమే దాన్ని దాటి వెళ్తారు
  • 2:07 - 2:10
    అప్పుడు నా వయస్సు 37 ఏళ్లు
  • 2:11 - 2:13
    "ఎన్అ ఏజ్ ఆఫ్ డిస్క్రిషన్" లో
    విలియం ట్రెవోర్ రాసాడు
  • 2:15 - 2:18
    కాలం ,వయస్సు దృష్ట్యా నేనప్పుడు
    ధ్యానం చేసేవాడిని
  • 2:18 - 2:21
    కుటుంబంలో అనారోగ్యం,
    ఆ తర్వాత నాకు ఐన గాయం దృష్ట్యా
  • 2:21 - 2:24
    వయస్సు మీరడం అనేది
    ఊహించలేమని తెలుసుకున్నాను
  • 2:25 - 2:29
    వయస్సు మీరడం అంటే అనివార్యాన్ని
    వాయిదా వెయ్యడమే
  • 2:29 - 2:31
    పరిస్థితులు చేయలేనిదాన్ని కాలం చూస్తుంది
  • 2:32 - 2:34
    ఇది మనస్సుకు కష్టం కలిగించేది.
  • 2:34 - 2:37
    ఒక లిస్టే చివరికి మిగులుతుంది.
  • 2:37 - 2:40
    జీవితానుభవాల్ని దశల వారీగా
    నమోదు చేయాలంటే
  • 2:41 - 2:44
    జారిపోతున్నదాన్ని ,పట్టి నేలకు దించాలి.
  • 2:44 - 2:47
    అది నాకు ,ఇతరులకూ క్షణకాలం భవిష్య.త్తును
    దర్శించే అవకాశం ఇస్తుంది
  • 2:47 - 2:49
    అది చేయగలమో ,లేదో తెలీదు
  • 2:50 - 2:54
    అప్పుడు నేనో లిస్ట్ ను చేయాలని మొదలెడితే
    వెంటనే బాధగా అనిపిస్తుంది
  • 2:54 - 2:57
    వయస్సును పట్టుకోడానికి పేజీలుపేజీలు
    వెనక్కి తిప్పాల్సి వుంటుంది
  • 2:58 - 3:02
    ఇక్కడ వేసే ప్రతీఅడుగూ మన జీవితంలో
    మొదటి వంద సం.వ తో సమానం
  • 3:03 - 3:06
    "27 ఏళ్ళు,హఠాత్తుగా కళ్ళు తెరిపించే వయసు"
  • 3:07 - 3:11
    "62 సున్నితంగా , క్రమంగా వెనకడుగు వేసే కాలం"
  • 3:12 - 3:16
    నేను జాగరూకుడనై వున్నాను...
    .ఇలాంటి ఆలోచనలు సాపేక్షమైనవి
  • 3:16 - 3:20
    ఇప్పటి చిన్నవారు ఎక్కువకాలం బ్రతుకుతారు
    దాంతో ఆలస్యంగా పెద్దవారౌతారు
  • 3:21 - 3:24
    క్రిస్టొఫర్ ఇషర్ వుడ్ పండుటాకు
    అనే పదబంధాన్ని వాడాడు
  • 3:24 - 3:26
    53 ఏళ్ళ వయస్సును వర్ణించడానికి,
  • 3:27 - 3:31
    లార్డ్ బైరన్ తననే 36 ఏళ్ళకే
    అలా వర్ణించుకునేవాడు.
  • 3:31 - 3:33
    ( నవ్వులు )
  • 3:33 - 3:37
    నేను జాగరూకుడనై వున్నా,ఐనా,జీవితం
    ఒక ఏటి నుంచి మరో ఏటికి
  • 3:37 - 3:39
    ఎలా సాగుతుందో ఊహించలేం.
  • 3:39 - 3:41
    అలాగే అదే వయస్సును ఒక్కొక్కరు
    ఒక్కో రకంగా గడుపుతారు.
  • 3:42 - 3:46
    అయితే కూడా ఆ లిస్ట్ కలిసిపోతుంది,ఏకమౌతుంది
  • 3:46 - 3:49
    అలా ప్రతిమలుపూ అద్దంలోని ప్రతిబింబం వలె
    స్పష్టంగా కనిపిస్తుంది
  • 3:49 - 3:51
    నాకూ అలానే జరిగింది
  • 3:52 - 3:55
    20ఏళ్ళప్పుడు "మనం ఎవరం అనేది
    ఖచ్చితంగా చెప్పలేము"
  • 3:56 - 4:01
    30 ల్లోకి రాగానే "చురుకైన జీవితానికి తయారీ మొదలవుతుంది"
  • 4:01 - 4:05
    40 ల్లో తెలుసుకోవడం అంటే ..
    "సున్నితంగా గది తలుపుల్ని మూయడం
  • 4:05 - 4:07
    నేను వెనక్కి రావడం లేదు"
  • 4:09 - 4:10
    అక్కడే వున్నాను.
  • 4:12 - 4:14
    నిజానికి, అందరమూ అక్కడే ఆగాము.
  • 4:15 - 4:17
    మిల్టన్ గ్లేసర్ అనే గొప్ప గ్రాఫిక్ డిజైనర్
  • 4:17 - 4:20
    అతని అందమైన దృశ్యమాలికలను
    మీరిక్కడ చూస్తున్నారు
  • 4:21 - 4:22
    ఆయన వయస్సిప్పుడు 85....
  • 4:22 - 4:27
    నొబొకోవ్ ఆ కాలాన్ని "....అనుభవాలతో
    పండిన దశ" అని
  • 4:27 - 4:31
    అది కళ, వర్ణాల వంటిదని నాతో అన్నాడు,
  • 4:31 - 4:34
    సాహిత్యం మన అనుభవాలను
    గుర్తుంచుకునేలా చేస్తుంది.
  • 4:35 - 4:39
    నిజానికి నా లిస్ట్ ను తాతగారికి చూపించాను,
  • 4:39 - 4:41
    అర్థమైనట్లు ఆయన తలఊపారు.
  • 4:41 - 4:45
    అప్పుడు ఆయన వయస్సు 95.అప్పుడాయన
    మరణానికి చేరువలో వున్నారు
  • 4:45 - 4:47
    ఈ మాట రాబర్ట్ బొలెనో వ్రాసాడు
  • 4:47 - 4:50
    "...ఇది మరణం లేని స్థితి లాంటిది."
  • 4:52 - 4:54
    నేను వెనక్కి చూసుకుంటే,
    ఆ మాట నాతోనే అన్నాడు, అవును,
  • 4:55 - 5:00
    22 ఏళ్ళ ప్రోస్ట్ చెప్పింది నిజమే.ఇప్పుడే
    చావబోమని మనకు బాగా తెలుసు
  • 5:02 - 5:05
    ఎడ్విన్ స్నెడ్ మాన్ అనే
    నాటాలజిస్ట్ చెప్పింది సత్యం
  • 5:05 - 5:07
    90 ఏళ్ళు వచ్చేసరికి
    ఖచ్పితంగా పో తామని తెలుసు.
  • 5:09 - 5:11
    అతనికి అలానే జరిగింది,
  • 5:11 - 5:12
    వాళ్ళకులాగానే.
  • 5:15 - 5:17
    ఇప్పుడు లిస్ట్ తయారయ్యింది:
  • 5:18 - 5:20
    ఓ వందేళ్ళకు సరిపోయేలా.
  • 5:21 - 5:23
    దాన్ని మళ్ళీ పరిశీలిస్తే,
  • 5:24 - 5:26
    దాన్ని పూర్తి చేయలేదని నాకు తెలుసు
  • 5:27 - 5:29
    జీవితాన్ని ఇంకా అనుభవించాల్సి వుంది,
  • 5:29 - 5:31
    ఇంకా ఎన్నో దశలని దాటాల్సి వుంది.
  • 5:33 - 5:34
    మెయిలర్ గురించి జాగరూకతతో వుండాలి,
  • 5:34 - 5:36
    44 కోసం ఎదురుచూస్తున్నాను.
  • 5:37 - 5:38
    కృతజ్ఞతలు.
  • 5:38 - 5:49
    ( కరతాళ ధ్వనులు )
Title:
జీవితంలోని దశలగూర్చి మహాకవుల ఆలోచనలు
Speaker:
జాషువా ప్రేజర్
Description:

మానవులుగా మనందరం విభిన్నం.అందరమూ జీవితంలోని దశలను ఒకే పద్ధతిలో దాటుతాము.మనం ఇష్టపడే పుస్తకాల్లోని పేజీల్లా ఇవి కదిలిపోతూవుంటాయి.మనస్సును కదిలించే ఈ ఉపన్యాసంలో జర్నలిస్ట్ జాషువా ప్రేజర్ జీవితంలోని విభిన్నదశలను నార్మన్ మెయిలర్ , జాయిసీ కెరోల్ ఓట్స్ విలియం ట్రెవోర్ మొదలగు రచయితల సూక్తుల సహాయంతో వివరించారు. మిల్టన్ గ్లేసర్ అనే గ్రాఫిక్ డిజైనర్ సాయంతో దృశ్యమాలికలుగా ఆవిష్కరించారు.పుస్తకాలు మన వ్యక్తిత్వాల భూత,వర్తమాన,భవిష్యత్తులను చెప్తాయి అంటారు ఈ ఉపన్యాసంలో.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
06:01

Telugu subtitles

Revisions