Return to Video

మేలైన మలేరియా వాక్సిన్ తయారీ కి దారి

  • 0:02 - 0:06
    ఇరవై కోట్ల మంది ప్రజలు,
  • 0:06 - 0:11
    ప్రతి ఏటా ఆఫ్రీకాలలో ఫాల్సీపరమ్ మలేరియా
    బారిన పడుతున్నారు,
  • 0:11 - 0:14
    అందులో యాభై లక్షల మంది చనిపోతున్నారు
  • 0:14 - 0:18
    నేను మీతో మలేరియా వాక్సిన్ల గురించి
    మాట్లాడదాం అనుకుంటున్నాను.
  • 0:19 - 0:24
    ఇంత వరకు మనము తయారు చేసినవి అంతగా
    పనికిరావు.
  • 0:25 - 0:26
    ఎందుకు?
  • 0:26 - 0:30
    మనము వాటి మీద గత శతాబ్దం పైగా నే
    పని చేస్తున్నాం.
  • 0:31 - 0:35
    మనము మొదలు పెట్టినప్పుడు, మనకున్న
    సాంకేతిక పరిజ్ఞానం పరిమితమైనది.
  • 0:35 - 0:42
    మనము ఆ పరాన్నజీవి లో కేవలం అతి తక్కువ
    భాగాన్ని మాత్రమే చూడగలిగాము.
  • 0:42 - 0:46
    ఈ రోజు సాంకేతిక బాగా అభివృద్ధి చెందినది,
  • 0:46 - 0:50
    అడ్వాన్స్డ్ ఇమేజింగ్ మరియు ఒమిక్స్ ప్లాటుఫార్మ్స్--
  • 0:50 - 0:54
    జెనోమిక్స్, ట్రాన్స్క్రిప్టుఒమిక్స్, ప్రోటీఓమిక్స్.
  • 0:55 - 0:58
    ఈ సాధనాలు మనకి చాలా స్పష్టముగా
  • 0:59 - 1:03
    ఈ పరాన్నజీవి ఎంత సంక్లిష్టముగా ఉందొ
    ఒక సంపూర్ణ అవగాహన కలిగించాయి.
  • 1:03 - 1:06
    కానీ,ఇప్పటికీ
  • 1:06 - 1:12
    వాక్సిన్ తయారు చేసే పద్దతి
    ఇంకా పాత పద్దతి లోనే సాగుతుంది.
  • 1:12 - 1:16
    ఒక మంచి వాక్సిన్ తయారు చేయటానికి
    ప్రాధమిక సూత్రాల జోలికి వెళ్ళాలి,
  • 1:16 - 1:21
    ఈ సంక్లిష్టతని మన శరీరాలు ఎలా
    తట్టుకుంటున్నాయో అర్ధం చేసుకోవాలి.
  • 1:22 - 1:27
    తరచుగా మలేరియా వ్యాధి కి గురి
    కాబడిన వారు, దానిని ఎలా
  • 1:27 - 1:28
    ఎదురుకోవాలో నేర్చుకుంటారు.
  • 1:29 - 1:32
    వారికి వ్యాధి సోకుతుంది కానీ
    అనారోగ్యం పాలవరు
  • 1:33 - 1:36
    ఆ మర్మం యాంటీబాడీస్ లో దాగిఉంది.
  • 1:37 - 1:41
    నా బృందం మళ్ళి ఆ క్లిష్టమైన
    పరాన్నజీవి ని పరిశోధించి,
  • 1:41 - 1:46
    మలేరియా ను జయించిన ఆఫ్రికన్ల నమూనాల తో
    కలిపి లోతుగా పరిశీలించారు,
  • 1:46 - 1:48
    ఈ ప్రశ్నకు జవాబు చెప్పటానికి:
  • 1:48 - 1:52
    "ఒక విజయవంతమైన యాంటీబోడీ
    ప్రతిక్రియ ఎలా ఉంటుంది?"
  • 1:52 - 1:56
    మేము 200 ప్రోటీన్ లకు పైగా కనుగొన్నము,
  • 1:56 - 2:00
    అందులో ఏవీ మలేరియా వాక్సిన్ ల
    పరిధి లో లేవు.
  • 2:00 - 2:05
    నా పరిశోధనా సంఘం పరాన్నజీవి లో కొన్ని
    ముఖ్యమైన అంశాలు కనిపెట్టలేకపోయి ఉండవచ్చు.
  • 2:06 - 2:12
    ఇంతక ముందు వరకు, ఎవరన్నా ఆసక్తి గొలిపే
    ప్రోటీన్ ను కనుగొంటే,
  • 2:12 - 2:15
    అది వాక్సిన్ కి ఉపయోగపడుతుందో లేదో
    పరీక్షించటానికి
  • 2:15 - 2:18
    బృంద అధ్యయనం జరిపేవారు.
  • 2:18 - 2:24
    ఈ అధ్యయనం లో సాధారణముగా ఆఫ్రికా లోని
    ఒక పల్లె లో 300 మంది పాల్గొనేవారు,
  • 2:24 - 2:27
    వారి నమూనాలను పరిశీలించి కనుగొనేవారు
  • 2:27 - 2:32
    ఆ ప్రోటీన్ యొక్క యాంటీబోడీస్ ఎమన్నా
    సూచించేవా మలేరియా ఎవరికీ సోకిందో,
  • 2:32 - 2:34
    ఎవరికీ సోకలేదో.
  • 2:34 - 2:36
    గత ముప్పై సంవత్సరాలలో,
  • 2:36 - 2:41
    ఈ పరిశోధనలు కొన్ని ప్రోటీన్ లను
    మాత్రమే పరీక్షించాయి
  • 2:41 - 2:44
    అది కూడా చాలా చిన్న నమూనాల్లో
  • 2:44 - 2:46
    ఇంకా, సాధారణముగా ఒకే ప్రదేశంలో.
  • 2:47 - 2:50
    వాటి ఫలితాలు నిలకడగా లేవు.
  • 2:51 - 2:57
    నా బృందం 30 ఏళ్ళ గ నడుస్తన్న
    ఇలాంటి పరిశోధనని కుదించి
  • 2:57 - 3:02
    ఒక ఆసక్తికరమైన ప్రయోగము గా మార్చి
    మూడు నెలలో ముగించింది.
  • 3:03 - 3:07
    సృజనాత్మకముగా ఆలోచించి మేము
    పదివేల నమూనాలను సేకరించాము,
  • 3:07 - 3:11
    ఏడూ ఆఫ్రికన్ దేశాలలో ని
    పదిహేను ప్రాంతాల నుండి,
  • 3:11 - 3:16
    కాలం,వయస్సు మరియు పలు రకాల తీవ్రతతో
  • 3:16 - 3:18
    ఆఫ్రీకా లో విస్తరించిన మలేరియా
    బాధితుల నుండి.
  • 3:19 - 3:24
    మేము ఒమిక్స్ ఇంటలిజెన్స్ వాడి పరాన్నజీవి
    ప్రోటీన్ లను ప్రాధాన్య క్రమము లో అమర్చి
  • 3:24 - 3:26
    ప్రయోగశాల లో రూపొందించాము
  • 3:26 - 3:31
    క్లుప్తము గా చెప్పాలంటే, ఒక చిప్ మీద
    మలేరియా పరాన్నజీవిని పునఃసృష్టించాము.
  • 3:32 - 3:35
    ఇది ఆఫ్రికా లో చేసాము,
    దానికి మేము చాలా గర్విస్తున్నాము.
  • 3:35 - 3:42
    (చప్పట్లు)
  • 3:42 - 3:45
    ఈ చిప్ ఒక చిన్న గాజు పలక,
  • 3:45 - 3:47
    కానీ ఇది మనకు అమితమైన సమాచారం ఇస్తుంది.
  • 3:48 - 3:54
    అదే సమయములో మేము వంద యాంటీబోడీ
    ప్రతిక్రియలను సేకరించాము .
  • 3:55 - 3:56
    మేము దేని గురించి వెతుకుతున్నాము?
  • 3:57 - 4:01
    ఒక విజయవంతమైన యాంటీబోడీ
    ప్రతిచర్య వెనక ఉన్న పద్ధతి,
  • 4:01 - 4:06
    అది ఎలా ఒక మంచి మలేరియా వాక్సిన్ ను
    రూపొందించేందుకు ఉపయోగపడుతుందని.
  • 4:07 - 4:09
    మేము ఇంకా కనిపెట్టే కృషి చేస్తున్నాము
  • 4:09 - 4:12
    ఆ పరాన్నజీవిని యాంటీబోడీస్ ఏమి చేస్తాయని.
  • 4:12 - 4:14
    అవి వాటిని ఎలా చంపుతాయి?
  • 4:14 - 4:18
    అన్ని కోణాల్లో నుంచి దాడి చేస్తాయా?
    సమిష్టి చర్య ఏమైనా ఉందా?
  • 4:18 - 4:20
    మనకు ఎంత ప్రతిరక్షకం కావాలి?
  • 4:20 - 4:26
    మా పరిశోధన సూచించింది ఏమిటంటే
    రవ్వంత యాంటీబోడీ సరిపోదని.
  • 4:26 - 4:30
    చాలా ఎక్కువ మోతాదు లో యాంటీబోడీస్
    కావలసి వస్తుందేమో
  • 4:30 - 4:32
    అనేక పరాన్నజీవి ప్రొటీన్ల్ పై.
  • 4:33 - 4:38
    యాంటీబోడీస్ పరాన్నజీవి ని అనేక మార్గాలలో
    సంహరిస్తాయని తెలుసుకున్నాము,
  • 4:38 - 4:44
    దీనిని విడిగా పరిశీలిస్తే వాస్తవాలను
    సరిగ్గా తెలపలేకపోవచ్చు.
  • 4:44 - 4:49
    ఇప్పుడు మేము ఆ పరాన్నజీవిని
    సమగ్రముగా చూడగలుగుతున్నాము,
  • 4:49 - 4:51
    నా బృందం మరియు నేను మా దృష్టిని
  • 4:51 - 4:56
    మన శరీరాలు ఈ క్లిష్టతని ఎలా అధిగమిస్తాయో
    అని అర్ధం చేసుకోవటం మీద పెట్టాం.
  • 4:56 - 5:00
    ఇది మనకు కావలసిన పురోగతి ని ఇస్తుందని
    మేము నమ్ముతూ,
  • 5:00 - 5:04
    ఇది వాక్సినేషన్ ద్వారా మలేరియాని చరిత్రలో
    కలిపేస్తుందని నమ్ముతున్నాము.
  • 5:05 - 5:06
    ధన్యవాదములు.
  • 5:06 - 5:08
    (చప్పట్లు)
  • 5:08 - 5:10
    (ప్రశంసలు)
  • 5:10 - 5:16
    (చప్పట్లు)
  • 5:16 - 5:19
    షోహమ్ అరద్ : సరే. వాక్సిన్ తయారీకి
    ఇప్పుడు మనము ఎంత దగ్గరలో ఉన్నాము?
  • 5:20 - 5:23
    ఫెయిత్ ఓసీర్ : మేము ఇప్పుడు ప్రక్రియ
    ప్రారంభ దశ లో ఉన్నాము,
  • 5:23 - 5:27
    వాక్సిన్ తయారీ లో ఏది వాడాలో ప్రయోగాలు
    చేస్తూ అర్ధం చేసుకుంటూ
  • 5:27 - 5:30
    ఉన్నాము. ఇంకా తయారీ మొదలుపెట్టలేదు.
  • 5:30 - 5:34
    కాబట్టి, మేము ఇంకా వాక్సిన్ తయారు చేయలేదు.
    కానీ దగ్గరలో ఉన్నాము .
  • 5:34 - 5:35
    షో అ : మేమూ
    విశ్వసిస్తున్నాము.
  • 5:35 - 5:37
    ఫే ఓ : మేము కూడా.
  • 5:37 - 5:41
    షో అ: "స్మార్ట్" గురించి చెప్పండి,
    దాని అర్ధం ఏమిటి,
  • 5:41 - 5:43
    ఇంకా అది మీకు ఎందుకు ముఖ్యమైనది?
  • 5:43 - 5:49
    ఫే ఓ: "సో స్మార్ట్"అంటే "సౌత్-సౌత్ మలేరియా
    యాంటిజెన్ రీసెర్చ్ పార్టనర్ షిప్."
  • 5:49 - 5:54
    సౌత్ సౌత్ అనేది ఆఫ్రికాలో
    మమ్మల్ని సూచిస్తుంది
  • 5:54 - 5:58
    ఇరు పక్కల తోడ్పాటు కోసం చూస్తూ,
  • 5:58 - 6:02
    అమెరికా వైపు గాని, యూరోప్ వైపు గాని
    చూడకుండా,
  • 6:03 - 6:06
    ఆఫ్రికా లోని వనరులని వాడుకోవటం.
  • 6:06 - 6:07
    "స్మార్ట్" లో
  • 6:07 - 6:11
    మలేరియా వాక్సిన్ ను తయారు చేయాలనే
    లక్ష్యమే కాకుండా,
  • 6:11 - 6:14
    ఆఫ్రికా శాస్త్రవేత్తలకు మేము
    శిక్షణ ఇస్తున్నాము.
  • 6:14 - 6:17
    ఎందుకంటే ఆఫ్రికా లో ఈ వ్యాధి వల్ల
    కలిగే కష్టాలు చాలా ఎక్కువ,
  • 6:17 - 6:21
    హద్దులు ఎల్లప్పుడూ చెరిపేయటానికి
    జనాలు కావాలి
  • 6:21 - 6:23
    విజ్ఞాన శాస్త్రం లో, ఆఫ్రికా లో.
  • 6:23 - 6:25
    షో అ : ఔను,ఔను,నిజమే.
  • 6:25 - 6:28
    (చప్పట్లు)
  • 6:28 - 6:30
    సరే. ఒక చివరి ప్రశ్న.
  • 6:30 - 6:32
    నాకు చెప్పండి, దీని గురించి
    కొంచెం చెప్పారని తెలుసు,
  • 6:32 - 6:36
    కానీ మలేరియా వాక్సిన్ ఉంటే పరిస్థితులు
    ఎలా మారతాయనుకుంటున్నారు?
  • 6:37 - 6:40
    ఫే ఓ: మేము ప్రతి సంవత్సరం
    యాభై లక్షల ప్రాణాలు కాపాడగలం.
  • 6:41 - 6:43
    20 కోట్ల రోగులు.
  • 6:43 - 6:50
    ఒక అంచనా ప్రకారం మలేరియా వల్ల ఆఫ్రికా ఏటా
    12 వందల కోట్ల అమెరికా డాలర్లు కోల్పోతుంది.
  • 6:50 - 6:52
    ఇది ఆర్థికపరమైన విషయం కూడా.
  • 6:52 - 6:54
    ఆఫ్రికా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  • 6:55 - 6:56
    షో అ : సరే,ధన్యవాదములు, ఫెయిత్.
  • 6:56 - 6:57
    ధన్యవాదములు.
  • 6:57 - 6:59
    (చప్పట్లు)
Title:
మేలైన మలేరియా వాక్సిన్ తయారీ కి దారి
Speaker:
ఫెయిత్ ఓసీర్
Description:

మలేరియా వాక్సిన్ ఒక శతాబ్దం క్రితం కనుగొన్నారు-- ఐనా ప్రతి సంవత్సరం అనేక మంది మనుష్యులు ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారు. మనము ఈ ప్రాణాధారమైన వాక్సిన్ ని ఎలా మెరుగుపరచగలం? ఈ వివరణాత్మక భాషణ లో ఇమ్మ్యూనోలోజిస్ట్ ,టెడ్ ఫెలో ఫిత్ ఓసీర్ తాను ఎలా సరికొత్త సాంకేతికను, శతాబ్దం నాటి జ్ఞానాన్ని ఓ కొత్త వాక్సిన్ రూపకల్పనలో రంగరించి, మలేరియా అనేదే లేకుండా చేయాలనే ప్రయాతాన్ని వివరిస్తున్నారు

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
07:11
Samrat Sridhara approved Telugu subtitles for The key to a better malaria vaccine
Samrat Sridhara accepted Telugu subtitles for The key to a better malaria vaccine
Samrat Sridhara edited Telugu subtitles for The key to a better malaria vaccine
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for The key to a better malaria vaccine
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for The key to a better malaria vaccine
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for The key to a better malaria vaccine
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for The key to a better malaria vaccine
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for The key to a better malaria vaccine
Show all

Telugu subtitles

Revisions