మన శరీరాలకి త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు
-
0:01 - 0:05మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని
-
0:05 - 0:07జలుబు తగ్గించినట్టుగా
-
0:07 - 0:09మీ గాయాలను నయం చేయగలిగితే?
-
0:09 - 0:12నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ
ఆక్సిడెంట్ కానీ జరిగితే , -
0:12 - 0:14ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము,
-
0:14 - 0:17ఇంకా తరుచుగా మచ్చలు కానీ,
బాధ కలిగించే దుష్ప్రభావాలు -
0:17 - 0:22కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని
అవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల. -
0:22 - 0:24నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను
-
0:24 - 0:29మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం
పెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు. -
0:29 - 0:33ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో
పోరాడామని ఆదేశిస్తుందో, -
0:33 - 0:35అలానే మన రోగ నిరోధక వ్యవస్థను
ఆదేశించవచ్చు -
0:35 - 0:38కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను
త్వరగా నయం చేయమని. -
0:39 - 0:43ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను
పునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు, -
0:43 - 0:46కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు
చాలా ఉన్నాయి. -
0:46 - 0:48కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి
పెంచుకుంటాయి, -
0:48 - 0:52సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా
పునః సృష్టించుకోగలవు, -
0:52 - 0:55ఇంకా కేవలం మనుషులమైన మనము
కాలేయాన్ని తిరిగి పెంచుకోగలం. -
0:55 - 0:58ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ
కోల్పోయినా. -
0:59 - 1:01ఈ మాయని వాస్తవానికి దగ్గరగా
తీసుకురావటానికి, -
1:01 - 1:05నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం
గాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో -
1:05 - 1:08రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా.
-
1:08 - 1:12మోకాలి మీద చిన్న గాయం నుండి
బాధించే సైనస్ రోగం వరకు, -
1:12 - 1:15మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని
ప్రమాదం నుండి కాపాడుతుంది -
1:15 - 1:17నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని,
-
1:17 - 1:20మన శరీర రక్షణ వ్యవస్థ గురించి
నాకు తెలిసిన దానిని ఉపయోగించి, -
1:20 - 1:22నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను
-
1:22 - 1:25దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే
మన పోరాటంలో. -
1:25 - 1:28ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను
చూస్తున్నప్పుడు వాటి -
1:28 - 1:30కండరాల పునరుత్పత్తి
సామర్ధ్యాలను గమనించినప్పుడు -
1:30 - 1:35మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన
కండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు -
1:35 - 1:37పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు
-
1:37 - 1:39ఆ పదార్థంలో ఇంకా చుట్టూ
ఉన్న కండరంలో ఉన్నాయని. -
1:40 - 1:41ఈ ఉదాహరణ లో,
-
1:41 - 1:45రోగనిరోధక కణాలు బాక్టీరియా తో
పోరాడటానికి కాకుండా -
1:45 - 1:48ఒక గాయం వైపు వెళ్లాయి.
-
1:48 - 1:51నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని
కనుగొన్నాను, -
1:51 - 1:52సహాయపడే టి కణం,
-
1:52 - 1:55నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది,
-
1:55 - 1:57ఇంకా అది గాయం నయం చేయటానికి
చాలా ముఖ్యం. -
1:58 - 2:02ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్
విరగొట్టి -
2:02 - 2:04దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి
ప్రయత్నించినట్టు, -
2:04 - 2:06మనకి నయం అవచ్చు,
-
2:06 - 2:08కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు,
-
2:08 - 2:09ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది.
-
2:10 - 2:12కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే,
-
2:13 - 2:14ఆరోగ్యకరమైన కండరం బదులుగా,
-
2:14 - 2:17దాని లోపల మన కండరం కొవ్వు కణాలను
అభివృద్ధి చేస్తుంది, -
2:17 - 2:19ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత
బలముగా ఉండదు. -
2:20 - 2:22ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి,
-
2:22 - 2:25మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు
-
2:25 - 2:28ఇంకా అది గాయం మునుపు
ఎలా ఉందో అలానే కనపడుతుంది. -
2:29 - 2:32నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా
-
2:32 - 2:34కొత్త కణజాలాన్ని సృష్టించడానికి
సంకేతాలు ఇచ్ఛే -
2:34 - 2:36పదార్థాలుసృష్టించడానికి
పనిచేస్తున్నాను -
2:37 - 2:41మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం
లోనికి చొప్పించిన ప్రతి సారి, -
2:41 - 2:43రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది.
-
2:43 - 2:48ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల
వరకు -
2:48 - 2:51ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని
నిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు. -
2:52 - 2:56నేను ఈ పదార్థాన్ని లేదా
కంచె ని శరీరంలో పెట్టినప్పుడు, -
2:56 - 3:00రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక
చిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది -
3:00 - 3:03అది మన స్టెమ్ కణాలు
ప్రవర్తించే పద్ధతిని మార్చగలవు. -
3:04 - 3:08ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ
కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో, -
3:08 - 3:09పరుగుకు బయలు దేరటం,
-
3:09 - 3:14లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక
కార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా -
3:14 - 3:16కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం
-
3:16 - 3:18మన స్టెమ్ కణాలు అభివృద్ధి
చెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి. -
3:19 - 3:21ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే,
-
3:21 - 3:23ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ,
-
3:23 - 3:25మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి.
-
3:27 - 3:30ఈ కంచెలను వివిధ రకాల
పదార్దాలతో తయారు చేస్తారు, -
3:30 - 3:33ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే
పదార్ధాల నుండి, -
3:33 - 3:36వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో,
-
3:36 - 3:39ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన
స్పాంజ్ ల నుండి, -
3:39 - 3:41రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి.
-
3:41 - 3:43ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను
తయారు చేయచ్చు, -
3:43 - 3:45వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా .
-
3:45 - 3:51ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక
బ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు -
3:51 - 3:55వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి
-
3:55 - 3:57అవి వివిధ కణాలకు మారే లాగా,
-
3:57 - 3:59ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో
-
3:59 - 4:02"లెస్ మిస్" లేదా
"లిటిల్ షాప్ హారర్స్" కోసం. -
4:02 - 4:05నేను కొన్ని నిర్దిష్టమైన
సంకేతాలను కలుపుతున్నాను -
4:05 - 4:10అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా
పునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి. -
4:10 - 4:14భవిష్యత్తులో, మనము చూడవచ్చు,
ఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్, -
4:14 - 4:18కండరాలను పూరించే అచ్చులు లేదా
గాయాలను నయం చేసే వాక్సిన్. -
4:18 - 4:21ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి
వుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు. -
4:21 - 4:23బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు.
-
4:23 - 4:25కానీ ఈ అభివృద్ధితో,
-
4:25 - 4:29ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో
కణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి, -
4:29 - 4:31మనం విపణిలోమన శరీర
రక్షణాత్మక వ్యవస్థతో పని చేసి -
4:31 - 4:35మనకు పునరుత్పత్తి లో సహాయపపడే
ఉత్పత్తులను చూడవచ్చు, -
4:35 - 4:39ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ
పడవచ్చేమో. -
4:40 - 4:41ధన్యవాదములు.
-
4:41 - 4:45(చప్పట్లు)
- Title:
- మన శరీరాలకి త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు
- Speaker:
- కైట్లిన్ సాడ్ట్లెర్
- Description:
-
ఎక్స్ -మెన్ లో వుల్వరైన్ లాగా మనము మన శరీరాలని మచ్చలు లేకుండా నయం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? టెడ్ సహచరురాలు కైట్లిన్ సాడ్ట్లెర్ మన రోగనిరోధక వ్యవస్థ గాయాలకు ప్రతిస్పందించే విధానాన్ని మార్చే కొత్త జీవ పదార్థాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ కలను నిజం చేయటానికి పని చేస్తున్నారు. ఈ చిన్న చర్చ లో , ఆవిడ ఈ ఉత్పతులు వివిధ మార్గాల్లో ఎలా శరీర పునరుత్పత్తికి సహకరిస్తాయో చెబుతారు.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 04:57
Samrat Sridhara approved Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Samrat Sridhara edited Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Annamraju Lalitha accepted Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Annamraju Lalitha edited Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Annamraju Lalitha edited Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Annamraju Lalitha edited Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Annamraju Lalitha edited Telugu subtitles for How we could teach our bodies to heal faster | ||
Anil Kumar Reddy Gade edited Telugu subtitles for How we could teach our bodies to heal faster |