Telugu subtitles

← అసాధ్యమైన పనులు చేయడం, భయాన్ని అధిగమించడం /డాన్ మేయర్/ టెడెక్స్ మాస్ట్రిక్ట్

Get Embed Code
85 Languages

Showing Revision 119 created 04/14/2016 by Annamraju Lalitha.

 1. ధన్యవాదాలు.
 2. ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు
  తన పుట్టినరోజున నాయకులు అందరూ
 3. రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని
  రావాలని ఉత్తర్వు జారీ చేశారు.
 4. కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు,
  కొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు,
 5. కొందరు బంగారం తెచ్చారు.
 6. లైను చివర తన గ్రామం నుండీ
  చాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి,
 7. చాలా ముడతలు పడిన చర్మము కలిగిన
  ఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు.
 8. అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు
  "రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని.
 9. ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి
  ఒక ఊదా మరియు పసుపు,
 10. ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా
  అందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు.
 11. "అది రాజుకు బహుమతి కాదు!
 12. అది ఏ రకమైన బహుమతి!? "
  అని యువరాజు అన్నాడు.
 13. "లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం"
  వృధ్ధుడు నెమ్మదిగా
 14. అతన్ని చూస్తూ చెప్పాడు,
 15. (నవ్వులు)
 16. ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక
  బహుమతి ఇస్తాను,
 17. అది వ్యాపింపచేయదగిన ఒక
  బహుమతని నమ్ముతున్నాను.
 18. కానీ దాని ముందు, మిమల్ని నాతో
 19. ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి.
 20. మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని
 21. చిన్న పిల్లాడిగా ప్రారంభించాను.
 22. మీలో ఎందరు జీవితం
  చిన్నపిల్లగా మొదలెట్టారు?
 23. యువకులుగా పుట్టారు?
 24. దాదాపు సగం మందా...ఒకె...
 25. (నవ్వులు)
 26. ఇకా మిగిలినవారు, ఏమిటి?
  మీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా?
 27. నేను మీ తల్లిని కలుసుకోవాలని
  అనుకుంటున్నాను!
 28. అసాధ్యం గురించి మాట్లాడడానికి!
 29. ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ
  అసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది.
 30. ఈ రోజు కోసం నేను ఎన్నో
  ఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను,
 31. ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు
 32. అసాధ్యాన్ని చేయడానికి
  ప్రయత్నించే రోజు ఈ రోజే,
 33. ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్.
 34. నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా
 35. మొదలు పెట్ట బోతున్నాను:
 36. ఇక నేను మీకు అసాధ్యం
 37. అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను.
 38. ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే
  బహుమతి ఇవ్వడం ద్వారా
 39. ముగించబోతున్నా:మీరు జీవితం లో
  అసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను.
 40. అసాధ్యాలను చేయాలన్న నా
  తపన లో నేను ప్రపంచ ప్రజల లో
 41. రెండు విషయాలు సార్వత్రికం గా
  ఉంటాయని గమనించాను.
 42. ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి,
 43. ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి.
 44. అసాధ్యం అయినవి చేయాలని నా తపన,
 45. నేను చాలా సంవత్సరాలగా చేస్తూ
  ఉన్న మూడు అంశాలు,
 46. నన్ను అసాధ్యమైనవి
  చేయాలని ప్రేరేపించాయి:
 47. డాడ్జ్ బాల్ లేదా
  మీరు పిలిచే "ట్రెఫ్ బాల్",
 48. సూపర్ మాన్,
 49. ఇంక దోమ.
 50. అవి నా మూడు కీలక పదాలు.
 51. మీకు తెలుసు
  నా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో .
 52. కాబట్టి నేను మిమ్మల్ని
  నా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ
 53. నడక లోకి తీసుకెళ్తాను,
  భయాల నుండి కలల వరకు,
 54. మాటలనుండి కత్తుల వరకు,
 55. డోడ్జ్ బాల్ నుండి
 56. సూపర్ మాన్ వరకు
 57. దోమ వరకు.
 58. ఇక నేను మీకు మీ జీవితం లో
 59. అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో
  చూపించాలని ఆశ తో ఉన్నాను.
 60. అక్టోబర్ 4, 2007.
 61. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు
  నా గుండె కొట్టుకుంది,
 62. నా కాళ్ళు వణికాయి
 63. హార్వర్డ్ యూనివర్సిటీ లోని
 64. సాండర్స్ థియేటర్ లో
 65. మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్
  బహుమతి అందుకోవడానికి
 66. నేను సహ రచయిత గా ఉన్న
  ఒక వైద్య పరిశోధన పేపర్
 67. "కత్తులు మింగడం.... మరియు దాని
 68. సైడ్ ఎఫెక్ట్స్" కోసం.
 69. (నవ్వులు)
 70. అది అంతకు ముందు నేనెప్పుడూ
  చదవని ఒక చిన్న పత్రిక
 71. ది బ్రిటీష్ మెడికల్
  జర్నల్ లో అచ్చయ్యింది.
 72. ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు,
 73. అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం,
 74. అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం.
 75. కానీ అది నాజీవితం లో అత్యంత
  ఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు.
 76. అక్టోబర్ 4, 1967, న
 77. ఈ భయస్థుడు, సిగ్గరి,
  సన్నగా ఉండే, వింపీ కిడ్
 78. తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు.
 79. అతను వేదిక మీదికి ఎక్కడానికి
  సిధ్ధమౌతూ ఉండగా,
 80. అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది,
 81. అతని కాళ్ళు వణక సాగాయి.
 82. హె మాట్లాడడానికి నోరు తెరిచాడు,
 83. మాటలు బయటకు రావడం లేదు.
 84. అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు.
 85. అతను భయం తో కొయ్యబారి పోయాడు,
 86. భయంతో స్థంభించి పోయాడు.
 87. ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్
 88. చాలా భయాలతో బాధ పడ్డాడు.
 89. అతనికి చీకటి అంటే భయం,
 90. ఎత్తులు అంటే భయం,
 91. సాలీళ్ళు ఇంకా
  పాములంటే భయం...
 92. మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా
  పాములంటే భయముందా?
 93. అవును, మీలో కొంత మందికి...
 94. అతనికి నీళ్ళు ఇంకా
  షార్క్స్ అంటే భయం ఉండేది...
 95. డాక్టర్స్ ఇంకా నర్సెస్
  ఇంకా డెంటిస్ట్స్ అంటే భయం,
 96. ఇంకా సూదులు ఇంకా
  డ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు.
 97. కానీ అన్నిటినీ మించి, అతనికి
 98. ప్రజలు అంటే భయం.
 99. ఆ భయస్థుడు, సిగ్గరి,
  సన్నగా దుర్బలం గా
 100. ఉండే బాబు నేనే.
 101. నాకు వైఫల్యం, ఇంకా
  తిరస్కరణ పట్ల భయం ఉండేది,
 102. తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన,
 103. ఇంకా అప్పటి రోజులలో
  పేరు కూడా పెట్టని ఒక సమస్య:
 104. సోషల్ యాంక్సైటీ డిసార్డర్.
 105. నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి
  రౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు.
 106. వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు
  పెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ
 107. రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు.
 108. ఆహ్, ఒక ఆట లో మాత్రం
  వాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు....
 109. డాడ్జబాల్-
 110. నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు.
 111. ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు,
 112. ఇక నేను తలెత్తి ఆ
  ఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్
 113. వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి
 114. బామ్, బామ్, బామ్!
 115. నాకు చాలా రోజులు నా ముఖం
  మంట పుడుతూ ఎర్రగా అయ్యి,
 116. నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్
  నుండి ఇంటికి రావడం గుర్తుంది.
 117. నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి,
 118. ఇంక వాళ్ళ మాటలు నా
  చెవుల్లో తిరుగుతూ ఉండేవి.
 119. ఇక ఇది అన్నదెవరో కానీ,
 120. "కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను
  విరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ
 121. బాధించవు..."
  అది ఒక అబధ్ధం.
 122. మాటలు చాకు లాగా కోయగలవు.
 123. మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు.
 124. మాటలు బయటకు కనపడని
 125. చాలా లోతైన గాయాలు చేయగలవు
 126. కాబట్టి నాకు భయాలు ఉండేవి.
  మాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి.
 127. ఇప్పటికి కూడా.
 128. కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి.
 129. ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్
  కథల్లోకి తప్పించుకునేవాణ్ణి
 130. ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు
 131. చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా
  సూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి
 132. నేను సత్యం ఇంకా
  న్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి,
 133. విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో
  పోరాడాలనుకునేవాణ్ణి,
 134. నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు
  చేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి.
 135. నాకు వాస్తవమైన విషయాల పట్ల
  కూడా అభిరుచి ఉండేది.
 136. నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్
  రిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను.
 137. మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్
  వర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా?
 138. నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం!
 139. నేను అసలువ్యక్తులు
  నిజమైనక్రుత్యాలుచేయడం
 140. చూశాను అవి నేను
  చేయాలనుకున్నాను.
 141. ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు
 142. ఆడనివ్వక పోతే, నేను నిజమైన
 143. ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు
  చేద్దామనుకుంటున్నాను.
 144. నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని
  ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను.
 145. నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు
 146. కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం
 147. తెలుసుకోవాలనుకుంటున్నాను,
  నేను అధ్భుతాలు చేసి లోకాన్ని
 148. మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం
  అసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను.
 149. కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే-
 150. అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం.
 151. ఒక రోజులో నా జీవితాన్ని
  ఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి.
 152. నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను
 153. నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి,
 154. నా గురువు, ఇంకానా
  స్నేహితుడు నన్ను అడిగాడు,

 155. "నీకు థ్రోమ్స్
  ఉన్నాయా, డానియెల్?"
 156. ఇక నేనన్నాను"థ్రోమ్స్?
  థ్రోమ్స్ అంటే ఏమిటి?"
 157. అతనన్నాడు," థ్రోమ్స్ అంటే
  ముఖ్యమైన జీవిత లక్ష్యాలు.
 158. అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు
  చేయాలనుకున్నది చేయగలగడం, మీరు
 159. వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం
  మీరు ఎలాఉండాలనుకుంటే
 160. అలా ఉండడం, మీరు
 161. ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు?
 162. మీరు ఎవరవుతారు?
 163. నేనన్నాను"నేనది చేయలేను! చాలా
  భయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!"
 164. ఆ రాత్రి నేను నా చాప
  ఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి,
 165. నక్షత్రాల కింద పరుచుకుని,
 166. గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను.
 167. ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది
  త్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు,
 168. ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు.
 169. కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను.
 170. నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది,
  నా కాళ్ళు వణుకుతున్నాయి.
 171. ఈ సారి అది భయం తో కాదు.
 172. నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది.
 173. ఇక ఆ తరువాత అయిదు రోజులూ
 174. నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను,
  నా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ.
 175. నా మెదడు 105 డిగ్రీ మలేరియా
  జ్వరం తో మండుతోన్ది.
 176. ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా
  నేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి.
 177. నేననుకున్నాను, "నా జీవితం తో
  ఏమి చేద్దామనుకుంటున్నాను?"
 178. చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి,
 179. స్పష్టత వచ్చిన క్షణం లో,
 180. నేను గ్రహించాను:
 181. ఒక చిన్న దోమ ,
 182. అనాఫిలిస్ స్టిఫెంసీ,
 183. ఆ చిన్న దోమ
 184. 5 మైక్రోగ్రాముల కంటే
  తక్కువ బరువున్నది
 185. ఒక ఉప్పు కణం కంటే చిన్నది,
 186. ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని,
  80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే
 187. అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను.
 188. అప్పుడు నేను గ్రహించాను,
  కాదు, కాదు,
 189. అది దోమ కాదు, అది
  దోమలో ఉన్నఒక చిన్న పారాసైట్,
 190. ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం
  ఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది.
 191. ఇక అప్పుడు నేను అనుకున్నాను
  కాదు, కాదు, అది దీనికన్నా
 192. చిన్నది,కానీ నాకు,
  అది చాలా పెద్దగా అనిపించింది.
 193. నేను గ్రహించాను,
 194. భయం నా బలహీనత అని,
 195. నా పారాసైట్, నా
 196. మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి
  ఇంకా పనికి రాకుండా చేసింది.
 197. మీకు తెలుసా, అపాయానికి ఇంకా
  భయానికి ఒక తేడా ఉంది.
 198. అపాయం వాస్తవం.
 199. భయం ఒక ఎంపిక.
 200. నేను గ్రహించాను నాకు ఒక
  ప్రత్యమ్నాయం ఉంది:
 201. నేను ఆ రాత్రి భయం లో జీవించి
  వైఫల్యం లో మరణించవచ్చు,
 202. లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను
 203. నా కలలను చేరుకోవచ్చు, నేను
  నా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు.
 204. మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం
 205. ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని
  నిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది.
 206. నేను గ్రహించాను అందరూ మరణిస్తారు,
  ప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు.
 207. మరణించే అప్పుడు మనము జీవిస్తాము.
 208. మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే,
 209. నిజంగా జీవించడం నేర్చుంటారు.
 210. కాబట్టి నా కధను ఆ రాత్రే
 211. మార్చుదామని అనుకున్నాను.
 212. నాకు చావాలని లేదు.
 213. నేను ఒక చిన్న
  ప్రార్థన చేశాను, "దేవుడా
 214. నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే,
 215. నా జీవితం లో ఇక భయాన్ని
  ఆధిపత్యం చేయనివ్వను.
 216. నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను,
 217. నేను నా కలలను
  చేరుకోవడానికి ప్రయత్నిస్తాను,
 218. నేను నా వైఖరి
  మార్చుకోవాలనుకుంటున్నాను,
 219. నా జీవితంతో అధ్భుతమైనది
  చేయాలనుకుంటున్నాను,నాపిలుపు
 220. ఇంకా ఉద్దేశ్యం
  తెలుసుకోవాలనుకుంటున్నాను,
 221. అసాధ్యం అసాధ్యం కాదని
  తెలుసుకోవాలనుకుంటున్నాను."
 222. నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు
  చెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను.
 223. (నవ్వులు)
 224. కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల
  జాబితా తయారు చేశాను:
 225. నేను అన్ని ప్రముఖ ఖండాలను
  చూడాలని నిశ్చయించుకున్నాను
 226. 7 ప్రపంచ వింతలను చూడాలి
 227. కొన్ని భాషలని నేర్చుకోవాలి,
 228. ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి
 229. సముద్రం లో ఓడ మీద నివసించాలి,
 230. అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి,
 231. స్వీడన్ లో అత్యంత
  ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి,
 232. మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి,
 233. నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి,
 234. సర్కస్ తో కలిసి పని
  చేయాలనుకున్నాను
 235. ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి.
 236. వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు
  నా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను.
 237. ప్రతీసారీ నేను ఒక
  లక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే,
 238. నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి
  కలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది.
 239. ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో
  ఒక చిన్న ద్వీపం లో నివసించాను
 240. 7 ఏళ్ళ పాటు
 241. తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో,
 242. తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా
  స్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే,
 243. ఒక గోచీ కట్టుకోని,
 244. ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం
  నేర్చుకోవాల్సివచ్చింది.
 245. ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి
 246. వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో
  అమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను,
 247. పుజో పోన్గో ఈక్వెడార్,
  ఒక తెగ తో నివసించాను,
 248. ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద
  నాకు నమ్మకం రావడం మొదలైంది.
 249. నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం
  లో చేరాను, ఇక అప్పుడు ,
 250. స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను,
  అక్కడ సంగీత వ్యాపారం లో
 251. పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్
  పైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను.
 252. నేను హాస్య విద్య
 253. నేర్చుకున్నాను,ఇంక
 254. గారడీ విద్య,ఇంకా
  మరకాళ్ళతో నడవడం,
 255. ఒక చక్ర సైకిల్ తొక్కడం,
  మంట మింగడం, గాజు తినడం.
 256. 1997లో డజను కంటే తక్కువమంది
  కత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను
 257. నేననుకున్నాను,
  " నేనది చేసి తీరాలని"
 258. నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను,
  అతన్ని కొన్ని
 259. చిట్కాలడిగాను.అతనన్నాడు
  "నేను నీకు రెండు
 260. చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత
 261. ప్రమాదకరం, ఇది చేస్తూ
  చాలా మంది చని పోయారు.
 262. రెండు:
 263. ఇది ప్రయత్నించకు!"
 264. (నవ్వులు)
 265. నేను దాన్ని నా లక్ష్యాల
  జాబితా లోకి
 266. ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ
  10 నుండి12 సార్ల చొప్పున
 267. 4 ఏళ్ళ పాటు
  సాధన చేస్తూ ఉన్నాను.
 268. నేను దాన్ని లెక్క కట్టాను...
 269. 4 x 365 [x12]
 270. సుమారు 13000 విఫల యత్నాలు తరవాత
 271. 2001 లో మొదటి సారి
  కత్తిని నా గొంతు లోకి దింపాను.
 272. ఆ సమయం లో నేను ఒక లక్ష్యం
 273. పెట్టుకున్నాను కత్తి మింగడం లో
  ప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని.
 274. కాబట్టి నేను ప్రతీ పుస్తకం,
  పత్రిక, వార్తా పత్రిక వ్యాసం,
 275. ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను
  అనాటమీ, ఫిజియాలజీ చదివాను,
 276. వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను,
 277. కత్తిని మింగేవాళ్ళందరినీ
  ఒక చోటికి స్వోర్డ్
 278. స్వాలోయర్ అసోసియేషన్
  ఇంటర్నేషనల్ లోకి చేర్చాను,
 279. కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద
 280. 2-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను
 281. అది బ్రిటీష్ మెడికల్
  జర్నల్ లో ప్రచురితమైంది.
 282. (నవ్వులు)
 283. ధన్యవాదాలు.
 284. (చప్పట్లు)
 285. నేను కొన్ని అధ్భుతమైన విషయాలు
  కత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను.
 286. కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి
  ఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు.
 287. ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు,
  మీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు
 288. ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో,
  మీరు దీని గురించి ఆలోచిస్తారు..
 289. కత్తి మింగడం ఇండియాలో
  మొదలయిందని నేనుతెలుసుకున్నా-
 290. నేను20 ఏళ్ళ అబ్బాయి గా
  మొదటిసారి చూసిన చోట-
 291. సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి.
 292. గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను
 293. వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో
 294. డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్
  జర్మనీ లో 1868 లో ధ్రుఢమైన
 295. ఎండోస్కోప్ తయారు చేయడంలో
  సహాయపడడానికి ఉపయోగించారు.
 296. 1906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం,
 297. మింగడం లో , ఇంకా అరుగుదలలో
  లోపాలు అధ్యయనం చేయడానికి,
 298. బ్రాంఖోస్కోప్ లాంటిది.
 299. కానీ గత 150 ఏళ్ళు గా,
 300. మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా
  డజన్ల కొద్దీ మరణాలు తెలుసు...
 301. ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్
  తయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్.
 302. కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న
  కత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో
 303. తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి
  29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం .
 304. మేము ఇంకా 3 నుండి 8
  ప్రమాదకరమైన కత్తి గాయాలు
 305. ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం.
 306. నాకు తెలుసు ఎందుకంటే నాకు
  ఫోన్స్ వస్తాయి.
 307. నాకు గత కొన్ని వారాల లో
 308. కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో
  ఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి,
 309. ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి.
 310. కాబట్టి ఇది చాలా అపాయకరమైనది.
 311. ఇంకొక విషయం నేను తెలుసుకున్నది
  ఏన్టంటే చాలామందికి
 312. కత్తి మింగే విద్య 2 నుండి
  10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి
 313. మింగడంఎలాగో
  నేర్చుకోవడానికి.
 314. కానీ అన్నిటికంటే అధ్భుతమైన
  విషయం నేను తెలుసుకున్నది
 315. కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం
  ఎలా నేర్చుకుంటారు అనేది.
 316. ఇక నేను మీకొక చిన్న
  రహస్యం చెప్పబోతున్నాను:
 317. మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి.
 318. మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక
  దాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి.
 319. నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి
  మెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి.
 320. కత్తిని మింగడానికి మనస్సును
  ధ్యానం లో ఉంచడం అవసరం,
 321. శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే
 322. ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను
  అధిగమించగలిగే పదునైన ఏకాగ్రత,
 323. సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్
  ద్వారా, పునరావ్రుత కండరాల
 324. జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు
  ఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది.
 325. ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి
  శరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను.
 326. ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని
 327. నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది,
 328. సర్వైకల్ అన్నవాహిక లో
  వాకట్టు రిఫ్లెక్స్ ని
 329. అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో
 330. 90 డిగ్రీల మలుపు తీసుకోవాలి,
  పెరిస్టాలిసిస్
 331. ప్రతిచర్యను అణచివేయాలి,
 332. బ్లేడ్ ని చాతీ లోకి
 333. రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి
 334. ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా
 335. నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది
 336. మీరు జాగ్రత్తగా చూస్తే,నా
 337. గుండె చప్పుడు
  నాకత్తి తో పాటుగా వినచ్చు
 338. ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి
 339. అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి
  గుండె కి ఆనుకోని ఉంది కాబట్టి.
 340. అది మీరు మాయ చేసి చూపించలేరు.
 341. ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్
  పక్కనుంచి
 342. జార్చాలి,లోయర్ అన్నవాహిక
  స్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి,
 343. స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను
  అణచివేస్తూ, డియోడినం వరకూ.
 344. నల్లేరుమీద నడక.
 345. (నవ్వులు)
 346. నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే,
 347. అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్)
  ఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను!
 348. మీరు మీ భార్యలను దాని గురించి
  తర్వాత అడగవచ్చు....
 349. అందరూ నన్ను అడుగుతారు,
  "నీ జీవితాన్ని
 350. అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని
  పక్కకు తోసి,ఇంకా కత్తిని
 351. మింగడానికి నువ్వు
  చాలాధైర్యం చేసి ఉంటావు.."
 352. కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ,
 353. బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి
 354. నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ
  ఇంకా తిరస్కారాన్నీ
 355. రిస్క్ చేయగలగడమే,అతని
 356. మనస్సుని విప్పడం, ఇంకా
 357. అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల
  గుంపు ముందు నిలబడి
 358. మీకు అతని కధ చెప్పడం ఇంకా
  అతని భయాలు ఇంకా కలల గురించి,
 359. శబ్దతా ఇంకా అలంకారంగా
  మొత్తం చెప్పే రిస్క్ చేయడం.
 360. ధన్యవాదాలు.
 361. (చప్పట్లు)
 362. మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన
  విషయం ఏమిటంటే నేను
 363. నా జీవితం లో ఎప్పుడూ గొప్ప
  పనులు చేయాలనుకున్నాను
 364. ఇప్పుడు చేస్తున్నాను.
 365. కానీ నిజమైన గొప్ప పని నేను
  21 కత్తులు ఒకసారి
 366. మింగగలగడం కాదు,
 367. లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్
  నాట్ కోసం 88 షార్క్స్ ఇంకా
 368. స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల
  తొట్టి లో
 369. అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్
  సూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా
 370. 1500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం
 371. ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది!
 372. లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్,
 373. లేదా గిన్నీస్ కోసం లాగడం,
 374. లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో
  ఫైనల్స్ వరకూ వెళ్ళడం,
 375. లేదా 2007 మెడిసిన్ లో
  ఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం.
 376. కాదు, నిజం గా అది
  చెప్పుకోదగిన విషయం కాదు.
 377. అందరూ అనుకునేది అదే, కాదు,కాదు,
  కాదు. అది కానే కాదు.
 378. నిజం గా అద్భుతమైన విషయం
 379. ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ,
  స్కిన్నీ వింపీ కిడ్ ని
 380. ఎవరైతే ఎత్తులంటే
  భయపడ్తారో,ఎవరైతే
 381. షార్క్స్ ఇంకానీళ్ళంటే
  భయపడ్తారో,ఇంకా
 382. డాక్టర్స్ ఇంకా నర్సెస్
  సూదులు ఇంకా పదునువస్తువులు
 383. ఇంకా ప్రజలతో
  మాట్లాడడం ఇక
 384. ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం
  మొత్తం30,000అడుగుల
 385. ఎత్తులో ఎగిరేట్టు
  చేస్తున్నాడు
 386. పదునైనవస్తువులు మింగడం షార్క్స్
  ఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం
 387. ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా
  మీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం.
 388. అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం.
 389. నేనెప్పుడూ అసాధ్యమైనవి
  చేయాలనుకున్నాను-
 390. ధన్యవాదాలు.
 391. (చప్పట్లు)
 392. ధన్యవాదాలు.
 393. (చప్పట్లు)
 394. నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను,
  ఇప్పుడు చేస్తున్నాను.
 395. నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి
  ప్రపంచాన్ని మార్చాలనుకున్నా,
 396. ఇప్పుడు చేస్తున్నాను.
 397. నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ
  ప్రపంచమంతా ఎగురుతూ,
 398. జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు
 399. చేస్తున్నా. మీకు తెలుసా?
 400. చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి
 401. పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది.
 402. (నవ్వులు) (చప్పట్లు)
 403. ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం
  కాలింగ్ తెలుసుకోవలనుకున్నా,
 404. ఇప్పుడు తెలుసుకున్నా.
 405. కానీ ఊహించండి ఏమిటో?
 406. ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో
  కాదు, నా బలాలతో కాదు.
 407. ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో.
 408. నా ప్రయోజనం ఇంకా కాలింగ్
  ప్రపంచాన్ని మార్చడానికి
 409. భయాన్నితరమటం ద్వారా,
 410. ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట,
 411. ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో
  ఒక జీవితం, ప్రజలకు
 412. సూపర్ హీరోస్ అవ్వటానికి
  ఇంకా వాళ్ళ జీవితాల్లో
 413. అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం.
 414. నా ప్రయోజనం వేరేవాళ్ళది
  కనుక్కోవడం లో సహాయ పడడం.
 415. మీదేమిటి? మీ ప్రయోజనం
 416. ఏమిటి?మీరు ఇక్కడికి
 417. ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం
 418. సూపర్ హీరోస్ అవడానికి
  పిలవబడ్డామని నా నమ్మకం.
 419. మీ అద్భుత శక్తి ఏమిటి?
 420. ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల
  పైగా ప్రజలలో,
 421. కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి
  ప్రపంచం లో డజను కంటే
 422. తక్కువ మిగిలారు,కానీ
  మీలాంటిది
 423. కేవలం మీరు ఒక్కరే.
 424. మీరు అపూర్వమైనవారు.
 425. మీ కధ ఏమిటి?
 426. మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది?
 427. మీ గొంతు వణికినా, గద్గదమైనా,
 428. మీ కధ చెప్పండి.
 429. మీ లక్ష్యాలు ఏమిటి?
  ఒకవేళ మీరు
 430. ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు,
  ఎటైనా వెళ్ళచ్చు అంటే-
 431. మీరేమి చేస్తారు? ఎటెళ్తారు?
 432. మీరేమి చేస్తారు?
 433. మీ జీవితం తో మీరేమి చేస్తారు?
 434. మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు
 435. మీరు కన్న పెద్ద కలలు ఏమిటి?
  తిరిగి ఆలోచించండి.
 436. నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు?
 437. మీరు వింతగా ఇంకా అస్పష్టంగా
 438. అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి?
 439. నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ
  కలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ?
 440. మీ ఆయుధం ఏమిటి? మీలో
 441. ప్రతి వాళ్ళ దగ్గరా
  ఒక కత్తి ఉంది,
 442. రెండు వైపులా పదునైన
  భయాలు ఇంకా కలల కత్తి.
 443. మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే.
  లేడీస్ అండ్ జెంటిల్మెన్,
 444. మీ కలలను అనుసరించండి,
 445. మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ
  చాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు.
 446. డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ
  రౌడీలు, ఏ పిల్లలు నేను
 447. ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో,
 448. వారికి నేను ఒకటే విషయం చెప్పాలి:
 449. ధన్యవాదాలు.
 450. ఎందుకంటే విలంస్ లేకపోతే,
  మనకు సూపర్ హీరోస్ ఉండరు.
 451. నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు
  అని నిరూపించడానికి ఉన్నాను.
 452. ఇది అత్యంత ప్రమాదకరం,
  ఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని
 453. ఆస్వాదిస్తారని
  నమ్ముతున్నాను.
 454. (నవ్వులు)
 455. నాకు ఈ విషయం లో మీ
  సహాయం కావాల్సి వస్తుంది.
 456. ప్రేక్షకులు:ర రెండు, మూడు.
 457. డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క
  పెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె?
 458. (నవ్వులు)
 459. మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో
  లెక్క బెట్టండి. రెడీనా?
 460. ఒకటి.
 461. రెండు.
 462. మూడు.
 463. కాదు.అది రెండు, మీకు
  అవగాహన వచ్చింది.
 464. ప్రేక్షకులు: ఒకటి.
 465. రెండు.
 466. మూడు.
 467. (ఆయాసపడ్తూ)
 468. (చప్పట్లు)
 469. DM: అవును!
 470. (చప్పట్లు)
 471. ధన్యవాదాలు.
 472. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.
  నా హృదయం లోన్చి ధన్యవాదాలు.
 473. అసలైన ధన్యవాదాలు నా కడుపు
  నుండి. నేను మీకు చెప్పాను
 474. నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి
  వచ్చాను, ఇప్పుడు చేశాను.
 475. కానీ ఇది అసాధ్యమైనది కాదు.
  ఇది నేను రొజూ చేస్తాను.
 476. ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి
  అసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం,
 477. ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్
  మీద నించోవడం,
 478. ఇంకా ప్రపంచాన్ని మార్చడం,
  ఒకసారి ఒక మాట,
 479. ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం.
 480. నేను మిమ్మల్ని కొత్త దారుల్లో
  ఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని
 481. నేను అసాధ్యం అసాధ్యం
  కాదు అని నమ్మేటట్టు చేస్తే,
 482. మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు
  చేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే,
 483. ఇక నా పని ముగిసినట్టు,
  ఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది.
 484. కలలు కనడం ఎప్పుడూ మానవద్దు.
  నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు.
 485. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు
 486. ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు.
 487. ఇక నా బహుమతి మీ కోసం:
 488. అసాధ్యం ఎప్పుడూ కాదు...
 489. ప్రేక్షకులు: అసాధ్యం.
 490. సుదీర్ఘ నడక బహుమతి లో భాగం.
 491. (చప్పట్లు)
 492. ధన్యవాదాలు.
 493. (చప్పట్లు)
 494. (ప్రోత్సాహం)
 495. హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!