Return to Video

మంచి సంభాషణకు పది సూత్రాలు

  • 0:00 - 0:03
    మీలో ఎంతమంది ఫేస్బుక్ నుంచి తమ
    స్నేహితుల లిస్టు నుంచి
  • 0:03 - 0:05
    ఎవర్నైనా తొలగించారు ..
    చేతులెత్తండి
  • 0:05 - 0:09
    కారణం వారు రాజకీయాలు,
    లేదా మతం, పిల్లలపెంపకం లేదా ఆహారం
  • 0:09 - 0:11
    గురించి ఆక్షేపణగా చెప్పడమే.
  • 0:11 - 0:13
    ( నవ్వులు )
  • 0:13 - 0:16
    మీలో ఎందరు కనీసం ఒకరికి దూరంగా
    ఉండాలనుకుంటున్నారు
  • 0:16 - 0:18
    కారణం మీరు వారితో మాట్లాడాలనుకోకపోవడమే
  • 0:19 - 0:21
    ( నవ్వులు )
  • 0:21 - 0:24
    మీకు తెలుసు సున్నితంగా సంభాషణ కొనసాగాలంటే
  • 0:24 - 0:27
    మనం మై ఫెయిర్ లేడీ లో హెన్రీ హిగిన్స్
    ఇచ్చిన సలహాను పాటిస్తే చాలు
  • 0:27 - 0:29
    ఆరోగ్యాన్ని దృష్టి లో
    వుంచుకోవాలి.
  • 0:29 - 0:33
    ఈ రోజుల్లోవాతావరణ మార్పులు, ఏంటివాక్సింగ్
    వంటివిషయాలు--
  • 0:33 - 0:34
    ( నవ్వులు )
  • 0:34 - 0:35
    రెండూ సురక్షితం కావు
  • 0:35 - 0:38
    కనుక మనముంటున్న ఈ లోకంలో
  • 0:39 - 0:41
    ప్రతీ సంభాషణా
  • 0:41 - 0:43
    వాదనగా మారే అవకాశముంది.
  • 0:43 - 0:46
    ఎక్కడైతే మన పొలిటీషియన్లు
    పరస్పరం మాట్లాడుకోలేరో
  • 0:46 - 0:48
    చివరికి అతి చిన్న విషయాలపట్ల కూడా
  • 0:48 - 0:53
    అసాధారణ రీతిలో అనుకూలంగానో,వ్యతిరేకంగానో
    కొట్టుకుంటూ ఉంటారో అది సాధారణం కాదు.
  • 0:53 - 0:56
    పదివేలమంది అమెరికా వయోజనులతో
    Pew రీసర్చి ఒక అధ్యయనం చేశారు.
  • 0:56 - 0:59
    దాని ప్రకారం ఈ కాలంలో మనం
    చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా
  • 0:59 - 1:00
    మరింతగా
    దూరమయ్యాము.
  • 1:00 - 1:03
    మరింతగా విడిపొయ్యాము.
  • 1:03 - 1:05
    మనం రాజీకి ఇష్టపడటం లేదు,
  • 1:05 - 1:07
    దానర్థం మనం ఇంకోరి మాటను వినడం లేదు.
  • 1:07 - 1:09
    ఎక్కడుండాలో నిర్ణయించుకుంటున్నాం.
  • 1:09 - 1:12
    ఎవర్ని పెళ్లాడాలో,ఎవరితో స్నేహం చేయాలో
  • 1:12 - 1:14
    మన నమ్మకాల ఆధారంగా.
  • 1:14 - 1:17
    మనం ఒకరి మాట మరొకరు వినడం లేదు.
  • 1:17 - 1:20
    సంభాషణ అంటే భాషణ శ్రవణాల సంతులనమే,
  • 1:20 - 1:23
    ఎక్కడో ఓ చోట ఈ సంతులనాన్ని కోల్పోయాం.
  • 1:23 - 1:25
    దీనికి టెక్నాలజీ కొంత కారణం.
  • 1:25 - 1:28
    ఈ స్మార్ట్ ఫోన్లు ఐతే మీ చేతుల్లో
  • 1:28 - 1:30
    లేదా మీ చేతికందేంత దూరంలో ఉంటాయి.
  • 1:30 - 1:32
    ఈ Pew రీసర్చి ప్రకారం,
  • 1:32 - 1:37
    3 వంతులమంది అమెరికా యువతరోజుకు 100 కు
    పైగా ఫోన్లో మెసేజ్ లను పంపుతుంటారు
  • 1:37 - 1:41
    చాలామంది ,దాదాపుగా అందరూ స్నేహితులకు
    text చేయడానికే ఇష్టపడుతారు
  • 1:41 - 1:43
    ముఖాముఖి మాట్లాడటం కన్నా.
  • 1:44 - 1:46
    The Atlantic. లో ఓ గొప్పఅంశముంది.
  • 1:46 - 1:49
    పాల్ బార్న్ వెల్ అనే హైస్కూల్ టీచర్ చే
    అది రాయబడింది.
  • 1:49 - 1:51
    ఆయన విద్యార్థులకు భావ ప్రసారాలపై
    ఒక ప్రాజెక్ట్ నిచ్చారు.
  • 1:51 - 1:55
    నోట్స్ పై ఆధారపడకుండా ఒక అంశం పై
    ఎలా మాట్లాడాలో నేర్పాలనుకున్నాడు
  • 1:55 - 1:57
    ఆయనిచ్చిన అంశం" నేను తెలుసుకున్నదేంటంటే"
  • 1:57 - 2:00
    ( నవ్వులు )
  • 2:00 - 2:03
    నేను గ్రహించిదేంటంటే సంభాషణా సామర్థ్యం
  • 2:03 - 2:07
    చాలాసార్లు నిర్లక్ష్యం చేసే ముఖ్యఅంశం
    మేము కూడా సరిగ్గా నేర్పలేకపోతున్నాం
  • 2:08 - 2:12
    పిల్లలు ఐడియాలతో తెరలపై
    గంటలకొద్దీ గడుపుతుంటారు
  • 2:12 - 2:14
    వారికి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి
  • 2:14 - 2:16
    సంభాషణా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి.
  • 2:16 - 2:19
    ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది
    కాని మనల్ని మనం వేసుకోవాలి
  • 2:20 - 2:21
    సందర్భశుధ్దితో, పొందికతో సంభాషణను
  • 2:21 - 2:27
    కొనసాగించడాన్ని మించింది
    ఈ శతాబ్దంలో ఏదైనా నైపుణ్యం ఉందా?" అని.
  • 2:27 - 2:29
    ఇప్పుడు ప్రజల్తో మాట్లాడటమే
    నా బ్రతుకుతెరువు:
  • 2:29 - 2:32
    నోబుల్ గ్రహీతల్నించి లారీ డ్రైవర్లదాకా
  • 2:32 - 2:34
    కోటీశ్వరులనుంచి, కిండర్గార్టెన్ టీచర్లు
  • 2:34 - 2:37
    ప్రభుత్వాధికారుల్నించి, ప్లంబర్ల దాకా
  • 2:37 - 2:40
    నేను ఇష్టపడేవారితో మాట్లాడతాను
    ఇష్టపడని వారితోనూ మాట్లాడుతాను
  • 2:40 - 2:44
    నేను మాట్లాడే కొందరితో వ్యక్తిగత స్థాయిలో
    తీవ్రంగా విభేధిస్తాను కూడా
  • 2:44 - 2:46
    అయినా గొప్ప సంవాదాలున్నాయి వారితో.
  • 2:46 - 2:50
    రాగల 10 నిము.ఎలా మాట్లాడాలో
    నేర్పాలనుకుంటున్నాను
  • 2:50 - 2:52
    ఎలా వినాలో కూడా
  • 2:53 - 2:55
    దీనిగూర్చి మీలో చాలామంది బోలెడన్ని
    సలహాలు వినే వుంటారు
  • 2:55 - 2:58
    ఎదుటి వారి కళ్లల్లో చూస్తూ
    మాట్లాడాలి లాంటివి
  • 2:58 - 3:01
    చర్చిండానికి మంచి అంశాలను ముందుగానే
    ఆలోచించిపెట్టుకోవాలి లాంటివి
  • 3:01 - 3:06
    మీరు వింటున్నట్లు తెలియడానికి
    చూడండి,నవ్వండి,తలఊపండి
  • 3:06 - 3:09
    విన్నదాన్ని మళ్లీ చెప్పండి
    లేదా సారాంశాన్నైనా
  • 3:09 - 3:11
    మీరివన్నింటినీ మరిచిపోండి
  • 3:11 - 3:12
    ఇదంతా చెత్త.
  • 3:12 - 3:15
    ( నవ్వులు )
  • 3:15 - 3:19
    మీరు నిజంగా ఏకాగ్రతతో వింటూ ఉంటే
    శ్రధ్ద తో వింటున్నట్లు
  • 3:19 - 3:23
    చెప్పడాన్ని
    నేర్చుకోవడంలో అర్థం లేదు
  • 3:23 - 3:25
    ( నవ్వులు )
  • 3:25 - 3:28
    ( కరతాళధ్వనులు )
  • 3:28 - 3:31
    ఇప్పుడు నేను ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్
    నైపుణ్యాలను వాడుతున్నాను
  • 3:31 - 3:34
    దీన్ని నేను నిజజీవితంలో పాటిస్తాను
  • 3:34 - 3:38
    ప్రజల్ని ఎలా ఇంటర్వ్యూ ఎలా చేయాలో
    ఇప్పుడు నేర్పుతాను
  • 3:38 - 3:42
    అది మీలోని సంభాషణా చాతుర్యాన్ని
    మరింత వృధ్ది చేస్తుంది
  • 3:42 - 3:43
    బోర్ కొట్టకుండా,
  • 3:43 - 3:45
    మీ సమయం వృధా కాకుండా,
    ఎవర్నీ నొప్పించకుండా
  • 3:46 - 3:49
    సంభాషణ చేసే నైపుణ్యాన్ని పెంచుకోండి.
  • 3:49 - 3:51
    మనందరం గొప్పగా మాట్లాడుతుండవచ్చు
  • 3:51 - 3:53
    ఎన్నోసార్లు మాట్లాడివుండవచ్చు
    అది ఎలా వుంటుందో తెలుసు
  • 3:53 - 3:57
    ఎలాంటి సంభాషణంటే మీరు ఉత్తేజితులై,
    మనసు నిండిన భావనతో బయటికి వస్తారు
  • 3:57 - 3:59
    లేదా నిజమైన బంధాన్ని
    ఏర్పరచుకున్నానని భావిస్తారు
  • 3:59 - 4:02
    పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామనుకుంటారు.
  • 4:02 - 4:03
    అది కారణం చెప్పలేని స్థితి
  • 4:03 - 4:06
    మన సంభాషణలు అలా వుండవెందుకుని
  • 4:06 - 4:09
    నావద్ద 10 ప్రాథమిక నియమాలున్నాయి
    వాటిని మీకు పరిచయం చేస్తాను
  • 4:09 - 4:13
    నిజాయితీగా అందులో ఒక్కటైనా ఎంచుకుని
    ప్రావీణ్యాన్ని సంపాదించండి
  • 4:13 - 4:16
    ఇప్పటికే మంచి సంభాషణల్ని ఆనందిస్తున్నారు
  • 4:16 - 4:18
    మొదటిది: ఒకే సమయంలో అనేక పనులను చేయకండి
  • 4:18 - 4:20
    సెల్ ఫోన్లను పక్కకు పెట్టమని
    నా ఉద్దేశ్యం కాదు
  • 4:20 - 4:23
    మీ చేతులోని టాబ్ ,
    కారుతాళాలు ఏవైనా పక్కన పెట్టండి.
  • 4:23 - 4:25
    నా ఉద్దేశం వర్తమానంలో జీవించండి
  • 4:25 - 4:27
    ఈ క్షణంలో బ్రతకండి
  • 4:27 - 4:30
    బాస్ తో చేసిన వాగ్వాదం గూర్చి ఆలోచించకండి
  • 4:30 - 4:33
    ఈ రాత్రి భోజనం గూర్చి చింతించకండి
  • 4:33 - 4:35
    సంభాషణ నుంచి తప్పుకోవాలంటే
  • 4:35 - 4:36
    పాలుపంచుకోకండి
  • 4:36 - 4:38
    కానీ సగం ఇటు సగం అటుగా వుండకండి
  • 4:38 - 4:41
    రెండవది: ప్రధాన పాత్ర వహించకండి
  • 4:41 - 4:43
    మీ అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటే
  • 4:43 - 4:49
    మీ మాటల్ని వెనక్కుతీసుకునేలా,వివాదాన్ని
    పెంచే అవకాశాన్ని ఇవ్వకండి
  • 4:49 - 4:51
    ఒక బ్లాగ్ వ్రాయండి
  • 4:51 - 4:54
    ( నవ్వులు )
  • 4:54 - 4:57
    పండితులను నా షో కు రానివ్వకపోడానికి
    ఓ గొప్పకారణముంది
  • 4:57 - 5:00
    ఎందుకంటే వారు విసుగు పుట్టిస్తారు
    వారు సంప్రదాయవాదులైతే
  • 5:00 - 5:03
    ఒబామాను, ఫుడ్ స్టాంపుల్ని
    అబార్షన్లను వ్యతిరేకిస్తారు
  • 5:03 - 5:04
    ఉదారవాదులైతే
  • 5:04 - 5:07
    పెద్దబ్యాంక్ లను ,ఆయిల్ కార్పొరేషన్ లను
    అసహ్యించుకుంటారు
  • 5:07 - 5:08
    వారిని అంచనావేయొచ్చు
  • 5:08 - 5:10
    మీరలా వుండాలనుకోడం లేదు
  • 5:10 - 5:15
    ప్రతి సంభాషణతో మీరో విషయం
    నేర్చుకోవచ్చని ఊహించుకోండి
  • 5:15 - 5:18
    పేర్గాంచిన చికిత్సకుడు M. Scott Peck
    ఇలా అన్నారు
  • 5:18 - 5:22
    నిజంగా వినాలంటే మీ అహాన్ని ప్రక్కకు జరపాలి
  • 5:22 - 5:25
    దానర్థం కొన్నిసార్లుమీ స్వంత అభిప్రాయాలను
    పక్కన బెట్టాలి
  • 5:26 - 5:29
    ఈ అంగీకారం వల్ల
  • 5:30 - 5:32
    వక్తకు ఎదురుదాడి అవకాశం తగ్గుతుంది
  • 5:32 - 5:35
    శ్రోతకు అతని అంతరంగం
  • 5:35 - 5:37
    తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
  • 5:37 - 5:40
    మళ్ళీ మీరో విషయాన్ని నేర్చుకుంటున్నానని
    ఊహించుకోండి
  • 5:41 - 5:45
    Bill Nye: మీరు కలిసే ప్రతీవ్యక్తీ మీకు
    తెలీని విషయంలో నిపుణుడైవుంటాడు
  • 5:45 - 5:47
    దీన్ని ఇంకోలా వివరిస్తాను
  • 5:47 - 5:50
    ప్రతీవారు ఏదో విషయంలో నేర్పరి
  • 5:51 - 5:54
    మూడవది.open-ended questions ని వాడండి
  • 5:54 - 5:56
    ఈ విషయంలో పత్రికా రచయితల సలహా తీసుకోండి
  • 5:56 - 5:59
    మీ ప్రశ్నల్ని ఎవరు,ఎప్పుడు,ఎక్కడ,
    ఎందుకు లేదా ఎలా తో మొదలెట్టండి
  • 5:59 - 6:03
    జటిలమైన ప్రశ్నలడిగితే సులువైన
    జవాబులొస్తాయి
  • 6:03 - 6:05
    మీరు భయపడ్డారా అని అడిగితే
  • 6:05 - 6:08
    మీ జవాబు లో తీవ్రత వుంటుంది
  • 6:08 - 6:11
    అయితే అవును భయపడ్డాను ,లేదా కాదు అని
  • 6:11 - 6:14
    మీరు కోపంగా వున్నారా? అవును
    నేను చాలా కోపంగా వున్నాను
  • 6:14 - 6:17
    వారినే వివరించమనండి
    ఎందుకంటే వారికే బాగా తెలుసు
  • 6:17 - 6:20
    ఎలాంటి భయం? లాంటి ప్రశ్నలడగండి
  • 6:20 - 6:21
    "మీకెలా అన్పించింది?"
  • 6:21 - 6:26
    కారణం వారప్పుడో నిముషం ఆగి
    దాన్ని గూర్చి ఆలోచిస్తారు
  • 6:26 - 6:29
    అప్పుడు మీకో ఆసక్తికరమైన
    జవాబు దొరుకుతుంది
  • 6:29 - 6:31
    నాల్గవది: సంభాషణా ప్రవాహంలో సాగండి
  • 6:32 - 6:35
    దానర్థం మీ మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి
  • 6:35 - 6:38
    వాటిని మనస్సులోంచి బయటికి పంపాలి
  • 6:38 - 6:40
    మేం ఇంటర్వ్యూలలో తరచుగా వింటుంటాము
  • 6:40 - 6:42
    దాంట్లో ఓ గెస్ట్ చాలాసేపట్నించీ
    మాట్లాడుతుంటుంటాడు
  • 6:42 - 6:45
    అప్పుడు హోస్ట్ వచ్చి ఓ ప్రశ్న అడుగుతాడు
  • 6:45 - 6:48
    ఆ ప్రశ్న గాల్లోంచి వచ్చినట్లు వుంటుంది
    లేదా జవాబు ఇచ్చేసినదయ్యి ఉంటుంది.
  • 6:48 - 6:51
    దానర్థం హోస్టే ఎప్పుడో వినడం ఆపేసివుంటాడు
  • 6:51 - 6:54
    కారణం అతను ఇది తెలివైన ప్రశ్న అనుకొంటాడు
  • 6:54 - 6:57
    ఈ ప్రశ్న వేయాలని నిశ్చయించుకుని వుంటాడు
  • 6:57 - 6:59
    మనమూ సరిగ్గా ఇలానే చేస్తాం
  • 6:59 - 7:02
    మనమక్కడ కూర్చుని ఎవరితోనో
    మాట్లాడుతున్నామని అనుకుంటాం
  • 7:02 - 7:06
    ఆ సమయంలో Hugh Jackmanను కాఫీ షాపులో
    కలిసినట్లు గుర్తుకొస్తుంది
  • 7:06 - 7:07
    ( నవ్వులు )
  • 7:07 - 7:09
    వినడం ఆపేస్తాం
  • 7:09 - 7:11
    కథలు, ఐడియాలు మీ దగ్గర కొస్తాయి
  • 7:11 - 7:14
    వాటి రాకపోకలు మీ కవసరం
  • 7:14 - 7:18
    ఐదవది: మీకు తెలియకుంటే తెలీదని చెప్పండి
  • 7:19 - 7:21
    ఇప్పుడు రేడియోలో ముఖ్యంగా NPR లు
  • 7:21 - 7:24
    వాళ్ళకి తెలుసు రికార్డ్
    చేయడానికెళ్తున్నట్లు
  • 7:24 - 7:28
    వాళ్లు ప్రవీణులమని చెప్పిన విషయాలపట్ల
    జాగ్రత్తగా వుండాలి
  • 7:28 - 7:30
    చెప్పే విషయాల గురించి
    ఖచ్చితంగా తెలిసుండాలి
  • 7:30 - 7:32
    అదే చేయండి.తప్పులు రాకుండా జాగ్రత్తపడండి
  • 7:32 - 7:34
    ప్రసంగాలు చీప్ గా ఉండరాదు
  • 7:35 - 7:38
    ఆరవది: మీ అనుభవాల్ని ఇతరులవాటితో పోల్చకండి
  • 7:39 - 7:42
    వాళ్లు చనిపోయిన కుటుంబసభ్యుని గురించి
    మాట్లాడుతుంటే
  • 7:42 - 7:45
    మీకు జరిగిన అలాంటి సంఘటనను
    గూర్చి మాట్లాడకండి
  • 7:45 - 7:48
    వారి ఉద్యోగ సమస్యలను గూర్చి మాట్లాడుతుంటే
  • 7:48 - 7:50
    మీ ఉద్యోగాన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో
    ఏకరువుపెట్టకండి
  • 7:50 - 7:52
    ఇవి ఒకటికావు.ఎప్పుడూ కాలేవు
  • 7:52 - 7:54
    ప్రతి అనుభవమూ వ్యక్తిగతమైనదే
  • 7:54 - 7:57
    మరీ ముఖ్యంగా అది మీ గురించికాదు
  • 7:57 - 8:01
    మీరెంత గొప్పవారో అప్పుడు
    నిరూపించాల్సిన అవసరం లేదు
  • 8:01 - 8:02
    లేదా మీరెన్ని బాథలు అనుభవించారో
  • 8:03 - 8:06
    ఓ సారి Stephen Hawking ను అతని IQ
    ఎంతని ఎవరోఅడిగారు ఆయనన్నాడు
  • 8:06 - 8:09
    "నాకూ తెలీదు.దాని గురించి గొప్పలు
    చెప్పేవాళ్లు ఎంతో కోల్పోతారు"
  • 8:09 - 8:11
    ( నవ్వులు )
  • 8:11 - 8:14
    సంభాషణలు ఎదిగే నిచ్చెనలు కావు
  • 8:17 - 8:18
    ఏడవది
  • 8:19 - 8:21
    మీరోసారి చెప్పింది మళ్లీ చెప్పకండి
  • 8:21 - 8:23
    అది మీస్థాయిని దిగజార్చుతుంది.
    బోర్ కొట్టిస్తుంది
  • 8:23 - 8:25
    మనం అలా చాలాసార్లు చేస్తాం
  • 8:25 - 8:29
    ముఖ్యంగా ఆఫీస్ సంభాషణల్లో,
    పిల్లలతో మాట్లాడేటప్పుడు
  • 8:29 - 8:31
    మనమో అంశాన్ని వివరించాలనుకున్నాం
  • 8:31 - 8:33
    అందుకని మళ్ళీ మళ్లీ చెప్తాం
  • 8:34 - 8:35
    అలా చేయకండి
  • 8:35 - 8:37
    ఎనిమిదవది: దుష్టులకు దూరంగా వుండండి
  • 8:37 - 8:40
    వాస్తవానికి ప్రజలు లక్ష్యపెట్టరు
  • 8:40 - 8:43
    సంవత్సరాలు, పేర్లు
  • 8:43 - 8:45
    తేదీలవంటి వివరాలు
  • 8:45 - 8:47
    మీరు మీ జ్ఞాపకాల్తో కుస్తీపడుతున్నారు
  • 8:47 - 8:49
    వారు శ్రధ్ద చూపేది మీగురించే
    వాటికోసం కాదు
  • 8:50 - 8:51
    మీరు ఎలాంటి వారో
    మీలో వారిలో వున్న
  • 8:52 - 8:54
    సాధారణ లక్షణాలేన్టో
    తెలుసుకోవాలనుకుంటారు
  • 8:54 - 8:56
    కనుక ఆ చిన్నచిన్న వివరాలను వదిలేయండి
  • 8:57 - 8:58
    తొమ్మిదవది
  • 8:58 - 9:01
    ఇది చివరిది కాదు కానీ చాలా ముఖ్యమైంది
  • 9:01 - 9:03
    వినండి
  • 9:03 - 9:06
    దీన్ని ఎందరు ప్రముఖులు చెప్పారో చెప్పలేను
  • 9:06 - 9:10
    వినడం అనేది చాలా ముఖ్యమైన మొదటి నైపుణ్యం
  • 9:10 - 9:12
    దాన్ని అభివృధ్ధి
    చేసుకోండి
  • 9:12 - 9:14
    బుధ్ధుడు చెప్పినదానిని
    తిరిగి చెప్తున్నాను
  • 9:14 - 9:16
    నోరు తెరిచారంటే దానర్థం మీరు
    నేర్చుకోవడం లేదని
  • 9:16 - 9:20
    Calvin Coolidge ఇలా అన్నాడు
    "బాగా వినే శ్రోత ఎప్పుడూ చెడిపోడు."
  • 9:21 - 9:22
    ( నవ్వులు )
  • 9:22 - 9:24
    మనం ఒకళ్ళ మాట మరొకళ్లం ఎందుకు వినడం లేదు?
  • 9:25 - 9:27
    మొదటిది, వాస్తవానికి
    మనం మాట్లాడాలనుకుంటాం
  • 9:27 - 9:29
    నేను మాట్లాడుతుంటే సంయమనంతో వుంటాను
  • 9:29 - 9:32
    నాకాసక్తి లేనిదేదీ నే వినాల్సిన అవసరం లేదు
  • 9:32 - 9:33
    అందరి దృష్టీ నా మీదే వుంది
  • 9:33 - 9:35
    నా స్వంత గుర్తింపును పెంచుకోగలను
  • 9:35 - 9:36
    ఇంకో కారణం కూడా వుంది
  • 9:37 - 9:38
    మనం అన్యమనస్కులమౌతాము
  • 9:38 - 9:42
    సగటు మనిషి నిముషాన్కి 225 మాటలు
    మాట్లాడుతాడు
  • 9:42 - 9:46
    కానీ మనం నిముషాన్కి 500 పదాలవరకు వినగలం
  • 9:46 - 9:50
    అలా మనస్సు ను మిగిలిన 275 పదాలతో నింపగలం
  • 9:50 - 9:53
    నాకు తెలుసు ఎవరిపైనైనా శ్రధ్ద చూపడానికి
  • 9:53 - 9:55
    ప్రయత్నం, శక్తి కావాలి.
  • 9:55 - 9:58
    కానీ అలా చేయకుంటే మీరు సంభాషణలో
    పాల్గొన్నట్లు కాదు
  • 9:58 - 10:01
    అది ఒకే ప్రదేశంలో కేవలం
    ఇద్దరు మనుష్యులు వాక్యాల రూపంలో
  • 10:01 - 10:03
    అరుస్తున్నట్లు.
  • 10:03 - 10:04
    ( నవ్వులు )
  • 10:04 - 10:07
    మనం పరస్పరం వినాలి
  • 10:07 - 10:09
    దీన్నే స్టీఫెన్ కోవే చాలా
    అందంగా చెప్పాడు
  • 10:09 - 10:13
    "మనలో చాలామంది అర్థం చేసుకోవాలనే
    ఉద్యేశం తో వినరు
  • 10:13 - 10:16
    బదులివ్వాలనే ఉద్యేశంతోనే వింటాం"
  • 10:17 - 10:21
    రూల్ పది: అదేంటంటే క్లుప్తంగా చెప్పు
  • 10:21 - 10:24
    మంచి సంభాషణ మినిస్కర్ట్ వంటిది
    ఆసక్తి రేపేంత పొట్టిదిగా వుండాలి
  • 10:24 - 10:27
    కానీ విషయాన్ని దాచేంత పొడుగ్గానూ వుండాలి
  • 10:27 - 10:28
    ( నవ్వులు )
  • 10:28 - 10:30
    (కరతాళధ్వనులు )
  • 10:30 - 10:35
    ఇప్పుడు చెప్పిందంతా క్రోడీకరిస్తే
    ఒకే ముఖ్యాంశం అదేంటంటే
  • 10:35 - 10:38
    ఇతరులపట్ల ఆసక్తి కలిగివుండు
  • 10:38 - 10:41
    మీకుతెలుసు నేను చాలా ప్రసిధ్ధులైన
    తాతగారివద్ద పెరిగాను
  • 10:41 - 10:43
    మా ఇంట్లో ఓ సంప్రదాయముండేది
  • 10:43 - 10:45
    మా గ్రాండ్ పేరంట్స్ తో మాట్లాడటానికి
    జనం వస్తుండేవారు
  • 10:45 - 10:48
    వాళ్లు వెళ్ళాక అమ్మ మా వద్దకు వచ్చేది
  • 10:48 - 10:50
    "వాళ్ళెవరో మీకు తెలుసా" అని అడిగేది
  • 10:50 - 10:52
    Miss America పోటీలో రెండవస్థానం ఆమెదే
  • 10:52 - 10:54
    ఆయన సాక్రమాంటో మేయర్
  • 10:54 - 10:57
    ఆమె పులిట్జర్ బహుమతి పొందింది
    ఆయన రష్యన్ బాలే కళాకారుడు
  • 10:57 - 11:00
    నేను ఎలాంటి అంచనాలతో పెరిగానంటే
  • 11:00 - 11:03
    ప్రతి ఒక్కరిలోనూ ఏదో
    ప్రత్యేకత దాగివుంటుంది
  • 11:04 - 11:07
    నిజాయితీగా అదే నన్ను గొప్ప హోస్ట్ ను
    చేసిందనుకుంటాను
  • 11:07 - 11:10
    సాధ్యమైనంతవరకు నా నోటిని మూసివుంచుతాను
  • 11:10 - 11:12
    నా మనస్సును తెరచి వుంచుతాను
  • 11:12 - 11:14
    సదా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుంటాను
  • 11:14 - 11:16
    అలా నేనెప్పుడూ నిరాశచెందలేదు
  • 11:17 - 11:19
    మీరూ అలానే చేయండి
  • 11:19 - 11:21
    బయటికి వెళ్లండి.జనాల్తో మాట్లాడండి
  • 11:21 - 11:22
    వారు చెప్పేది వినండి
  • 11:22 - 11:26
    ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి
  • 11:26 - 11:28
    కృతజ్ఞతలు
  • 11:28 - 11:31
    ( కరతాళధ్వనులు )
Title:
మంచి సంభాషణకు పది సూత్రాలు
Speaker:
సెలెస్టీ హెడ్ లీ
Description:

సంభాషణా చాతుర్యమే మీ ఉద్యోగానికి కేంద్ర బిందువైతే,మంచి సంభాషణ లెలా వుండాలో తెలుసుకుంటారు.మనలో చాలామందికి సంభాషణా చాతుర్యం లేదు.దశాబ్దాల తరబడి రేడియో హోస్ట్ గా పనిచేసారు సెలెస్టీ హెడ్ లీ.మంచి సంభాషణకు కావలసిన దినుసులు ఆమెకు తెలుసు.నిజాయితీ,ధైర్యం , స్పష్టత , వినేగుణం ఇవే. ఆలోచింపజేసే ఈ ఉపన్యాసం లో ఆమె సంభాషణకళను పెంపొందించుకునే పది సూత్రాలను మనతో పంచుకున్నారు.బయటికెళ్ళండి."ప్రజల్తో మాట్లాడండి.వినండి."చివరికి ఇలా అన్నారు."చాలా ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి" అని.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
11:44

Telugu subtitles

Revisions