మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని జలుబు తగ్గించినట్టుగా మీ గాయాలను నయం చేయగలిగితే? నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ ఆక్సిడెంట్ కానీ జరిగితే , ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము, ఇంకా తరుచుగా మచ్చలు కానీ, బాధ కలిగించే దుష్ప్రభావాలు కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని అవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల. నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం పెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు. ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో పోరాడామని ఆదేశిస్తుందో, అలానే మన రోగ నిరోధక వ్యవస్థను ఆదేశించవచ్చు కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను త్వరగా నయం చేయమని. ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను పునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు, కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు చాలా ఉన్నాయి. కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి పెంచుకుంటాయి, సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా పునః సృష్టించుకోగలవు, ఇంకా కేవలం మనుషులమైన మనము కాలేయాన్ని తిరిగి పెంచుకోగలం. ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ కోల్పోయినా. ఈ మాయని వాస్తవానికి దగ్గరగా తీసుకురావటానికి, నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం గాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా. మోకాలి మీద చిన్న గాయం నుండి బాధించే సైనస్ రోగం వరకు, మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ప్రమాదం నుండి కాపాడుతుంది నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని, మన శరీర రక్షణ వ్యవస్థ గురించి నాకు తెలిసిన దానిని ఉపయోగించి, నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే మన పోరాటంలో. ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను చూస్తున్నప్పుడు వాటి కండరాల పునరుత్పత్తి సామర్ధ్యాలను గమనించినప్పుడు మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన కండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు ఆ పదార్థంలో ఇంకా చుట్టూ ఉన్న కండరంలో ఉన్నాయని. ఈ ఉదాహరణ లో, రోగనిరోధక కణాలు బాక్టీరియా తో పోరాడటానికి కాకుండా ఒక గాయం వైపు వెళ్లాయి. నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని కనుగొన్నాను, సహాయపడే టి కణం, నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది, ఇంకా అది గాయం నయం చేయటానికి చాలా ముఖ్యం. ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్ విరగొట్టి దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి ప్రయత్నించినట్టు, మనకి నయం అవచ్చు, కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు, ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే, ఆరోగ్యకరమైన కండరం బదులుగా, దాని లోపల మన కండరం కొవ్వు కణాలను అభివృద్ధి చేస్తుంది, ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత బలముగా ఉండదు. ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి, మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు ఇంకా అది గాయం మునుపు ఎలా ఉందో అలానే కనపడుతుంది. నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా కొత్త కణజాలాన్ని సృష్టించడానికి సంకేతాలు ఇచ్ఛే పదార్థాలుసృష్టించడానికి పనిచేస్తున్నాను మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం లోనికి చొప్పించిన ప్రతి సారి, రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది. ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల వరకు ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని నిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు. నేను ఈ పదార్థాన్ని లేదా కంచె ని శరీరంలో పెట్టినప్పుడు, రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక చిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది అది మన స్టెమ్ కణాలు ప్రవర్తించే పద్ధతిని మార్చగలవు. ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో, పరుగుకు బయలు దేరటం, లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక కార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం మన స్టెమ్ కణాలు అభివృద్ధి చెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి. ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే, ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ, మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి. ఈ కంచెలను వివిధ రకాల పదార్దాలతో తయారు చేస్తారు, ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే పదార్ధాల నుండి, వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో, ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన స్పాంజ్ ల నుండి, రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి. ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను తయారు చేయచ్చు, వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా . ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక బ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి అవి వివిధ కణాలకు మారే లాగా, ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో "లెస్ మిస్" లేదా "లిటిల్ షాప్ హారర్స్" కోసం. నేను కొన్ని నిర్దిష్టమైన సంకేతాలను కలుపుతున్నాను అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా పునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి. భవిష్యత్తులో, మనము చూడవచ్చు, ఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్, కండరాలను పూరించే అచ్చులు లేదా గాయాలను నయం చేసే వాక్సిన్. ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి వుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు. బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు. కానీ ఈ అభివృద్ధితో, ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో కణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి, మనం విపణిలోమన శరీర రక్షణాత్మక వ్యవస్థతో పని చేసి మనకు పునరుత్పత్తి లో సహాయపపడే ఉత్పత్తులను చూడవచ్చు, ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ పడవచ్చేమో. ధన్యవాదములు. (చప్పట్లు)